Andhra Pradesh : ఇసుక రీచ్‌ల వేలం పేరిట భారీ మోసం

ఏపీలో ఇసుక రీచ్‌ల వేలం పేరిట ఒక వ్యక్తి ఏకంగా కోట్ల రూపాయలు కాజేశాడు.

Andhra Pradesh : ఇసుక రీచ్‌ల వేలం పేరిట భారీ మోసం

Andhra Pradesh : ఏపీలో ఇసుక రీచ్‌ల వేలం పేరిట ఒక వ్యక్తి ఏకంగా కోట్ల రూపాయలు కాజేశాడు. గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది సంతకం ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేశాడు. ఏపీలో ఇసుక రీచ్‌ల వేలాన్ని ప్రభుత్వం జేపీ గ్రూప్‌కు ఇచ్చింది.

ఇసుక రీచ్‌లు లీజుకు ఇస్తామని కాకినాడకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఏడుగురు బాధితుల నుంచి రూ.3.50 కోట్లు వసూలు చేశాడు. నిెందితుడికి గతంలో నేర చరిత్ర ఉంది. 2018 లో సైఫాబాద్‌లో నిందితుడిపై  ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేసిన కేసు నమోదైంది.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ భవానీపురం పోలీసుస్టేషన్ లో కేసు నమోదు చేశారు. నిందితుడి బ్యాంకు ఎకౌంట్ నుంచి రూ. 2 కోట్లు సీజ్ చేశారు.

Read: Andhra Pradesh Covid : ఏపీలో కరోనా కేసులు..24 గంటల్లో 8 వేల 110 కేసులు