Mandous Cyclone Weakened : అల్పపీడనంగా బలహీనపడిన మాండూస్ తుపాను

మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీన పడిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

Mandous Cyclone Weakened : అల్పపీడనంగా బలహీనపడిన మాండూస్ తుపాను

Mandous Cyclone

Updated On : December 11, 2022 / 9:18 AM IST

Mandous Cyclone weakened : మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీన పడిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తుపాన్ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ముందు నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుందని వెల్లడించారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి రోజూ సమీక్షలు నిర్వహిస్తూ అమలు చేయాల్సిన విధి విధానాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.

విపత్తుల సంస్థ డైరెక్టర్ అంబేద్కర్ తో కలిసి తుపాను కదలికలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశామని సాయి ప్రసాద్ తెలపారు. ఉద్రిక్తతను కచ్చితంగా అంచనా వేయడంతోపాుట ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా నష్ట తీవ్రతను తగ్గించగలిగామని చెప్పారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించామని పేర్కొన్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్, ఏపీ అలర్ట్ ద్వారా ఆరు జిల్లాల్లోని కోటి మందికి పైగా సబ్ స్క్రైబర్లకు ముందుగానే తుపాను హెచ్చరిక సందేశాలు పంపించామని వెల్లడించారు.

Mandous Cyclone: తీరందాటిన మాండౌస్ తుపాన్‌.. రాయ‌ల‌సీమ‌, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం

ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో మాండూస్ తుపాను తీవ్ర ప్రభావం చూపిందన్నారు. లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 33 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 778 మందికి పునరావాసం కల్పించినట్లు చెప్పారు. సహాయక చర్యల కోసం ప్రకాశం 2, నెల్లూరు 3, తిరుపతి 2, చిత్తూరు 2 చొప్పునమొత్తం 5 ఎన్ డీఆర్ఎఫ్, 4 ఎస్ డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్లు వెల్లడించారు.