Mekapati Chandrasekhar Reddy: మేం ముగ్గురం గెలుస్తాం.. నీ సంగతేంటి? అనిల్‌కు మేకపాటి సవాల్ ..

మాజీ మంత్రి అనిల్ నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నాతోపాటు.. ఆనం, కోటంరెడ్డి కూడా గెలుస్తారు. ఒకవేళ నేను గెలవకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలేస్తా. నువ్వు గెలవకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటావా? అంటూ అనిల్‌ కుమార్ యాదవ్‌కు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్ విసిరారు.

Mekapati Chandrasekhar Reddy: మేం ముగ్గురం గెలుస్తాం.. నీ సంగతేంటి? అనిల్‌కు మేకపాటి సవాల్ ..

Mekapati Chandrasekhar Reddy

Mekapati Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లా (Nellore District) లో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. వైసీపీ (YCP) నుంచి బహిష్కరణకు గురైన ముగ్గురు ఎమ్మెల్యేలు మేకపాటి, ఆనం రాంనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) , కోటంరెడ్డి‌ శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy)పై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. సస్పెండ్‌కు గురైన ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని అన్నారు. అనిల్ వ్యాఖ్యలకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి అనిల్ నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని, ముందు నువ్వు ఓడిపోతున్నావు అది చూసుకో అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తానని, గెలవకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలేస్తానని, నువ్వు గెలవకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటావా? అంటూ అనిల్‌కు చంద్రశేఖర్‌రెడ్డి సవాల్ విసిరారు. సింగిల్ డిజిట్‌తో గెలిచిన నువ్వు ఎక్కడ.. 35వేల మెజార్టీతో గెలిచిన నేనెక్కడ.. అంటూ అనిల్‌ను ఎద్దేవా చేశారు.

MLA Anil Kumar Yadav : మీరు మళ్లీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా- ఆ ముగ్గురికీ ఎమ్మెల్యే అనిల్ సవాల్

వచ్చే ఎన్నికల్లో నేనేకాదు.. ఆనం, కోటంరెడ్డి కూడా గెలవడం ఖాయం. మేం ముగ్గురం నూటికి నూరుపాళ్లు ఎమ్మెల్యేలుగా గెలుస్తాం. రాబోయే ఎన్నికల్లో మీరే చూస్తారు. ఇప్పుడు అనిల్ పార్టీ భ్రమలో మాట్లాడుతున్నాడని, కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతుందని, వైసీపీ ఓడిపోబోతుందని మేకపాటి జోస్యం చెప్పారు. మమ్మల్ని సస్పెండ్ చేశారు, నీకు పార్టీ టికెట్టు ఇవ్వరని ప్రచారం జరుగుతుంది.. ముందు నువ్వు చూసుకో అనిల్ అంటూ మేకపాటి హితవు పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం చెప్పిన విధంగా ఓటు వేశానని మేకపాటి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ నాకు ఇవ్వనని జగన్ చెప్పారు, వేరే వ్యక్తికి ఇస్తున్నాము అతనికి మద్దతు తెలపాలని అన్నారు. పార్టీకి పనిచేసిన వారిని వెన్నుపోటు పొడిచే వారిని మంచి పార్టీ అనరని మేకపాటి పేర్కొన్నారు.

Minister Roja: నలుగురు బహిష్కృత ఎమ్మెల్యేలకు మంత్రి రోజా సవాల్

పార్టీ టికెట్ అడిగితే నన్ను సస్పెండ్ చేయడం సీఎం జగన్‌కు న్యాయం కాదని, మమ్మల్ని సస్పెండ్‌చేసి మాపైనే అట్రాసిటీ కేసులు పెట్టించమని సజ్జల చెప్పటం చాలా గొప్పతనం అంటూ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ‌పైన అసంతృప్తితో ఉన్నారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి నాకు ఐదు కోట్లు ఇచ్చారనే ఆరోపణలు నిజం కాదని, మేకపాటి కుటుంబం మీకోసం పదవులు రాజీనామా చేసి, మీకు ఆర్థికంగా ఉపయోగపడ్డ వ్యక్తులం అని గుర్తుంచుకోవాలని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.