Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు

గతంలో ఉన్న వాళ్లు 8 రూపాయలు వడ్డీకి తెస్తే మేము 7 రూపాయలకు తేవడం జరిగిందన్నారు. రేట్లు పెరగడంలో రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు

Minister Buggana

Minister Buggana : జగన్ పార్టీని అందరికీ సమానత్వం కోసమే స్థాపించడం జరిగిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గతంలో ఉన్న వాళ్లు 8 రూపాయలు వడ్డీకి తెస్తే మేము 7 రూపాయలకు తేవడం జరిగిందన్నారు. గోవాలో జరిగిన 35వ జీఎస్టీ సమావేశంలో చింతపండుపై జీఎస్టీ ఎత్తి వేయడం జరిగిందని చెప్పారు. బాదుదే బాదుడులో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మంత్రి బుగ్గన ఫైర్ అయ్యారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రేట్లు పెరగడంలో రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి తేల్చి చెప్పారు. రేట్లు పెరగటానికి కేంద్ర ప్రభుత్వమే కారణం అన్నారు. టీడీపీకి దమ్ముంటే అమ్మ ఒడి వద్దని చెప్పాలని మంత్రి బుగ్గన సవాల్ విసిరారు. జిల్లాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో చూపిస్తాం అన్నారు. వ్యాపారం చేసేదానికి ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతం అని మంత్రి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో నీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు

న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తామన్నారు. లా కాలేజీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అని మంత్రి చెప్పారు. చంద్రబాబు తన పాలనతో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని మంత్రి బుగ్గన నిలదీశారు. పెండింగ్ బిల్లులు కూడా త్వరలోనే పూర్తి అవుతాయన్నారు. కార్యకర్తలకు త్వరలో పని కల్పించే పథకం తీసుకొస్తామన్నారు.

AP : ప్రభుత్వ దుకాణాల్లో ఆ బ్రాండ్లు ఇప్పుడెందుకు కనిపించట్లేదో చెప్పే దమ్ము ప్రభుత్వానికి ఉందా?

కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం..
రాష్ట్రంలో రైతులకు లక్షల రూపాయల అందిస్తున్నారు జగన్. 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని జగన్ అభివృద్ధి చేస్తున్నారు. ముస్లిం సోదరులకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు. గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది. చంద్రబాబుకి రాష్ట్రంలో అభివృద్ధి కనిపించదా? టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి లక్ష 49 వేలు క్రాప్ ఇన్సూరెన్స్ పడింది.