Minister Kakani : ఫోన్ ట్రాప్ కాదు.. చంద్రబాబు మ్యాన్ ట్రాప్.. కోటంరెడ్డిపై మంత్రి కాకాని, ఆదాల ఫైర్ ..

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ, రూరల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డిలు ఫైర్ అయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రభుత్వం పై అభాండాలు వేస్తున్నాడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ పెద్ద ట్రాష్ అని కొట్టిపారేశారు.

Minister Kakani : ఫోన్ ట్రాప్ కాదు.. చంద్రబాబు మ్యాన్ ట్రాప్.. కోటంరెడ్డిపై మంత్రి కాకాని, ఆదాల ఫైర్ ..

Minister Kakani

Minister Kakani : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ, రూరల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డిలు ఫైర్ అయ్యారు. మంత్రి కాకాని మాట్లాడుతూ.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రభుత్వం పై అభాండాలు వేస్తున్నాడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ పెద్ద ట్రాష్ అని కొట్టిపారేశారు. జరిగింది ఫోన్ ట్రాప్ కాదని, చంద్రబాబు మాన్ ట్రాప్ అన్నారు. కోటంరెడ్డి ఫోన్లో మాట్లాడిన వ్యక్తే మీడియాకు వాస్తవం వెల్లడించాడని అన్నారు. టాపింగ్ ఆరోపణ నిజమైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదని కోటంరెడ్డిని మంత్రి ప్రశ్నించారు. పెంచిపోషించిన పార్టీకే కోటంరెడ్డి ద్రోహం చేశాడన్నారు. కోటంరెడ్డికి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయని, రూరల్ నియోజక వర్గ ముఖ్యనేతలంతా పార్టీ‌లోనే కొనసాగుతున్నారని మంత్రి కాకాని చెప్పారు. వాపును చూసి కోటంరెడ్డి బలమని భ్రమపడుతు న్నాడని, ప్రజలంతా సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.

Minister Kakani : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఎంపీ, రూరల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి అబద్దాలు మాట్లాడటం చాలా తప్పని, ఈ విషయాన్ని కోటంరెడ్డి గుర్తుచేసుకోవాలని సూచించారు. మూడున్నరేళ్లుగా అరాచకం చేశావు, డబ్బు పిచ్చి ఎక్కువైంది అంటూ కోటంరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నీ చరిత్ర త్వరలో ప్రజల దగ్గర గుట్టు విప్పుతానంటూ ఆదాల హెచ్చరించారు. ఎంతమందిని ఏ విధంగా వేధించావో ప్రజలకు తెలుసునని న్నారు.

 

నేనే రూరల్ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని, దమ్ముంటే శ్రీధర్ రెడ్డి పోటీ చేయాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి సవాల్ చేశారు. నేను ఎంపీగా పోటీ చేస్తే ఎమ్మెల్యే కంటే ఐదు వేల ఓట్లు రూరల్‌లోనే ఎక్కువగా వచ్చాయని అన్నారు. రియల్ ఎస్టేట్, హోటల్స్, వ్యాపారస్థులు నిన్నటి వరకు హడలిపోయారని, అ స్థాయిలో నియోజకవర్గంలో కోటంరెడ్డి అరాచకాలు కొనసాగాయని అన్నారు. కాంట్రాక్టర్‌గా వచ్చాను కాబట్టే ప్రజా సేవ చేస్తున్నా.. పోరాటాల్లో నుంచి వచ్చానని చెప్పుకుంటున్న శ్రీధర్ రెడ్డి ప్రజలను వేధిస్తున్నాడని ఆదాల అన్నారు.