Roja On Selvamani Comments : మా ఆయన మాట్లాడిన మంచి మాటలను వక్రీకరించారు-మంత్రి రోజా

తన భర్త మాట్లాడిన మంచి మాటలను టీడీపీ నేతలు వక్రీకరించారని ఆరోపించారు. తన భర్త వ్యాఖ్యలను సమర్థించారు. ఏ లాంగ్వేజ్ సినిమాల షూటింగ్ లు..(Roja On Selvamani Comments)

Roja On Selvamani Comments : మా ఆయన మాట్లాడిన మంచి మాటలను వక్రీకరించారు-మంత్రి రోజా

Roja On Selvamani Comments

Roja On Selvamani Comments : తమిళ సినిమాల షూటింగ్ లు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు? అంటూ.. తెలుగు రాష్ట్రాల్లో తమిళ్ సినిమా షూటింగ్స్ పై అభ్యంతరం తెలుపుతూ ఏపీ మంత్రి ఆర్కే రోజా భర్త, సౌత్ ఇండియన్ ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఫెప్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ సినిమాల షూటింగ్‌లను ఏపీ, తెలంగాణలో కాకుండా తమిళనాడు రాష్ట్రంలోనే జరపాలని సెల్వమణి డిమాండ్ చేయడం వివాదానికి దారితీసింది. సెల్వమణి వ్యాఖ్యలు రాజకీయ రంగు కూడా పులుముకున్నాయి. మంత్రి రోజా భర్తను టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. మంత్రి రోజా భర్త ఏపీకి నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్‌లకు సంబంధించి సెల్వమణి చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ రచ్చపై మంత్రి రోజా స్పందించారు. తన భర్త మాట్లాడిన మంచి మాటలను టీడీపీ నేతలు వక్రీకరించారని ఆమె ఆరోపించారు. తన భర్త వ్యాఖ్యలను రోజా సమర్థించారు. ఏ లాంగ్వేజ్ సినిమాల షూటింగ్ లు ఆ రాష్ట్రంలో జరిగితే బాగుంటుందని మాత్రమే తన భర్త చెప్పారని మంత్రి రోజా తేల్చి చెప్పారు. కానీ విపక్ష టీడీపీ నేతలు మాత్రం ఈ వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. ఏ లాంగ్వేజ్ సినిమాలు ఆ రాష్ట్రంలో షూటింగ్ లు జరుపుకుంటే ఆ రాష్ట్రానికి డబ్బులు వస్తాయని, ఆ రాష్ట్రంలోని టెక్నీషియన్స్ జీవితాలు బాగుపడతాయనే తన భర్త అలా చెప్పడం తప్పా? అని రోజా ప్రశ్నించారు.(Roja On Selvamani Comments)

” నా భర్త సెల్వమణి సౌతిండియన్ టెక్నీషియన్స్ ప్రెసిడెంట్. ఏ లాంగ్వేజ్ సినిమాలు ఆ రాష్ట్రంలో తీసుకుంటే, ఆ రాష్ట్రంలోని టెక్నీషియన్స్ కి, కార్మికులకు పని ఉంటుంది. వాళ్ల కుటుంబాలు బాగుంటాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది అని మాట్లాడారు. అయితే, ఆ వ్యాఖ్యలను వక్రీకరించి టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేయాలనుకుంటోంది. తెలుగు సినిమా షూటింగ్ లు మన ఆంధ్రాలోనూ చేయాలని చెప్పి సీఎం జగన్ జీవో ఇచ్చారు. టీడీపీలో తెలుగు సినిమా హీరోలు ఉన్నారు. దర్శకులు ఉన్నారు. నిర్మాతలు ఉన్నారు. వాళ్లందరిని వచ్చి ఆంధ్రాలో షూటింగ్ చేయమనండి. తెలుగు సినిమాల కలెక్షన్స్ 70శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతోంది.

RK Selvamani : తమిళ షూటింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు?? వివాదం రేపిన రోజా భర్త..

కనీసం 20శాతం షూటింగ్ అయినా ఏపీలో చేయమని చెప్పి చిరంజీవి వచ్చి కలిసినప్పుడు ప్రభుత్వం క్లియర్ కట్ గా చెప్పింది. అంత క్లియర్ కట్ గా చెప్పినా ఎందుకు రాలేదు. మీ పార్టీలో ఉన్న వాళ్లు ఆంధ్రప్రదేశ్ ను గాలికి వదిలేస్తారు. మీ ఓటుకు నోటు కేసు కోసం ఆ రోజు తెలంగాణ నుంచి పారిపోయి వచ్చేటప్పుడు గుర్తు రాని షూటింగ్ లు, ఇండస్ట్రీ, అభివృద్ధి.. ఈ రోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ వాళ్లకు గుర్తు రావడం, నా భర్త చెప్పిన దాన్ని వక్రీకరించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? పెద్ద హీరోల తమిళ్ సినిమాలు హైదరాబాద్ లో తీయడం ఎంతవరకు న్యాయం?

చార్మినార్ కోసం హైదరాబాద్ వెళ్లి షూటింగ్ చేయొచ్చు. గోల్కొండ టూంబ్స్ కోసం హైదరాబాద్ వెళ్లి షూటింగ్ చేయొచ్చు. అలానే తాజ్ మహల్ కోసం ఢిల్లీ వెళ్లి చేయొచ్చు. కానీ, తమిళనాడులో ఉన్న వాటిని ఇక్కడ సెట్ చేసి షూటింగ్ లు చేయడం వల్ల జీఎస్టీ తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తుంది. టెక్నీషియన్స్ అన్యాయం అయిపోతారు. అందుకే, ఏ లాంగ్వేజ్ సినిమాల షూటింగ్ లు ఆ రాష్ట్రంలోనే చేయండి, అక్కడి టెక్నీషియన్స్ బాగుపడాలి. కార్మికులు బాగుపడాలి. జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరగాలి అని నా భర్త చెప్పిన దాని గురించి అందరూ ఆలోచించండి.

నా భర్త మాట్లాడిన వీడియోను మీరు మళ్లీ ప్లే చేయండి. జనాలు అందరూ వింటారు. వారే అర్థం చేసుకుంటారు. మా ఆయన మాట్లాడిన మంచి మాటలను వక్రీకరించి చెప్పడం తెలిసిన తెలుగుదేశం పార్టీ వాళ్లకి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి వైపునకి నడిపించాలి అనే ఆలోచన ఎందుకు రాలేదు?” అని మంత్రి రోజా ప్రశ్నించారు.

కాగా, తెలుగు రాష్ట్రాల్లో తమిళ సినిమాల షూటింగ్స్ జరుపుకోవడంపై సెల్వమణి అభ్యతరం తెలిపిన విషయం తెలిసిందే. కోలీవుడ్ సినిమాల షూటింగ్‌లను తమిళనాడు రాష్ట్రంలోనే జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ నటులు రజినీకాంత్, విజయ్, అజిత్ కుమార్ లాంటి వారు తమ సినిమా షూటింగ్‌లను హైదరాబాద్, విశాఖపట్నంలో చేస్తుండటం వల్ల తమిళనాడులోని సినీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన వాపోయారు. కాబట్టి, అగ్రహీరోలు తమ సినిమా షూటింగ్‌లను తమిళనాడులోనే షూట్ చేయాలని డిమాండ్ చేశారు.