RK Selvamani : తమిళ షూటింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు?? వివాదం రేపిన రోజా భర్త..

సెల్వమణి ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. ''రజినీకాంత్, విజయ్, అజిత్ సినిమాల షూటింగ్స్ హైదరాబాద్, వైజాగ్ లో ఎందుకు చేస్తున్నారు. తమిళ హీరోలకు...........

RK Selvamani : తమిళ షూటింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు?? వివాదం రేపిన రోజా భర్త..

Selvamani

RK Selvamani :  సౌత్ ఇండస్ట్రీలోనే కాక బాలీవుడ్ నుంచి కూడా కొన్ని సినిమాలు హైదరాబాద్ వచ్చి షూటింగ్స్ జరుపుకుంటాయి. ఎక్కువగా రామోజీ ఫిలింసిటీలో షూటింగ్స్ జరుపుకుంటాయి. ఇటీవల తమిళ సినిమాలు చాలా వరకు తెలుగు రాష్ట్రాలలోనే షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇక్కడ పర్మిషన్లు తొందరగా ఇవ్వడం, ఖర్చులు తక్కువగా ఉండటం, మంచి లొకేషన్లు ఉండటం, రామోజీ ఫిలింసిటీ ఉండటంతో హైదరాబాద్, వైజాగ్, అనంతపురం.. ఇలా సినిమాని బట్టి లొకేషన్ ని ఎంచుకొని షూటింగ్స్ చేస్తున్నారు. గత కొంతకాలంగా తమిళ స్టార్ హీరోల సినిమాలన్నీ హైదరాబాద్ లోనే షూటింగ్స్ జరుపుకున్నాయి. రజినీకాంత్, విజయ్, అజిత్ సినిమాలు హైదరాబాద్ లోనే షూట్ జరిగాయి. ప్రస్తుతం ధనుష్, శివ కార్తికేయన్, విజయ్, అజిత్ సినిమాలు మళ్ళీ ఇక్కడే షూట్ జరుపుకుంటున్నాయి.

దీంతో ఈ విషయంపై రోజా భర్త, ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) అధ్యక్షుడు సెల్వమణి మాట్లాడారు. సెల్వమణి ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. ”రజినీకాంత్, విజయ్, అజిత్ సినిమాల షూటింగ్స్ హైదరాబాద్, వైజాగ్ లో ఎందుకు చేస్తున్నారు. తమిళ హీరోలకు సంబంధించిన సినిమా షూటింగ్స్ చెన్నైలో ఎందుకు చెయ్యట్లేదు. తమిళ చిత్ర పరిశ్రమను నమ్ముకొని వేలాది మంది కార్మికులు ఉన్నారు. వారికి ప‌ని క‌ల్పించ‌క‌పోతే పరిశ్ర‌మ‌నే న‌మ్ముకున్న వారు రోడ్డు మీద పడతారు. ఇక్కడ షూటింగ్స్ చేయ‌డానికి ప‌నికి రామా? ప్ర‌తి చిన్న దానికి హైద‌రాబాద్‌, వైజాగ్ అంటూ వెళ్తే మిమ్మ‌ల్ని న‌మ్ముకున్న తమిళ కార్మికుల భ‌విష్య‌త్తు ఏమవ్వాలి” అని ప్రశ్నించారు.

Dhanush : ధనుష్‌కి సమన్లు జారీ చేసిన తమిళనాడు హైకోర్టు..

ఇకపై త‌మిళ చిత్రాల షూటింగ్స్‌ను త‌మిళ‌నాడులోనే జ‌ర‌గాలంటూ త‌మిళ నిర్మాత‌ల‌కు త‌మిళ సినీ కార్మిక సంఘం అల్టిమేటం జారీ చేసింది. దీనిపై తమిళ నిర్మాతలు, హీరోలతో కూడా చర్చలు జరుపుతున్నారు. మరి ఈ విషయంపై వారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.