Roja Slams Chandrababu : మహిళలపై అఘాయిత్యాలు, లీకేజీల వెనకున్నది మీరే – మంత్రి రోజా

మంత్రి ఆర్కే రోజా.. మరోసారి టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు నీచంగా దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే ప్రతి అఘాయిత్యం నుంచి ప్రశ్నాపత్రం లీకేజీల వరకూ..

Roja Slams Chandrababu : మహిళలపై అఘాయిత్యాలు, లీకేజీల వెనకున్నది మీరే – మంత్రి రోజా

Roja Slams Chandrababu

Updated On : April 30, 2022 / 7:29 PM IST

Roja Slams Chandrababu : ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. మరోసారి టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు నీచంగా దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే ప్రతి అఘాయిత్యం నుంచి ప్రశ్నాపత్రం లీకేజీల వరకూ అన్నింటి వెనకా టీడీపీ నేతలే ఉన్నారని ఆరోపించారు. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా తండ్రీ కొడుకులు రోడ్డుపైకి వచ్చి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పర్యాటక రంగ అభివృద్ధికి మన రాష్ట్రంలో బోలెడన్ని వనరులు ఉన్నాయని, కేంద్రం సహకారంతో ఏపీ పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని మంత్రి రోజా అన్నారు.

చిత్తూరులో జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంఛార్జి మంత్రి ఉషశ్రీ చరణ్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రోజా, ఎంపీలు, ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు.