AP PRC : సమ్మె నిర్ణయం ఉపసంహరణ.. స్టీరింగ్ కమిటీతో ప్రభుత్వం చర్చలు సఫలం

పీఆర్సీ అంశంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు.

AP PRC : సమ్మె నిర్ణయం ఉపసంహరణ.. స్టీరింగ్ కమిటీతో ప్రభుత్వం చర్చలు సఫలం

Ap Prc Sucess

AP PRC : పీఆర్సీ అంశంలో స్టీరింగ్ కమిటీతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మంత్రులు, స్టీరింగ్ కమిటీ మధ్య 7 గంటల పాటు చర్చలు జరిగాయి. అనంతరం మంత్రులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుందని, తమ డిమాండ్లకు అంగీకారం తెలిపిందని స్టీరింగ్ కమిటీ నేతలు చెప్పారు. ఈ క్రమంలో స్టీరింగ్ కమిటీ నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం అర్థరాత్రి నుంచి చేపట్టాల్సిన సమ్మె నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.

స్టీరింగ్ కమిటీ సభ్యులు.. సీఎం జగన్ తో వర్చువల్ గా మాట్లాడారు. మంత్రుల కమిటీ అంగీకరించిన డిమాండ్లపై ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఒప్పంద పత్రాన్ని అధికారులు సీఎం జగన్ కు పంపారు. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు.

Mukesh Ambani: భారత్ లోనే అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ

పీఆర్సీ ఆశించినంతగా లేకపోవడంతో అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగుల ఆవేదన గురించి మంత్రుల కమిటీ చర్చించిందన్నారు. అన్ని అంశాలపై లోతుగా చర్చించి ఏకాభిప్రాయంకి వచ్చామన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అంతా ఓ కుటుంబంలా ఉండాలన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చెయ్యడంలో ఉద్యోగులది కీలక పాత్ర అని చెప్పారు. ఉద్యోగులు ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలని సీఎం జగన్ అనుకుంటారని సజ్జల అన్నారు. కొన్ని డిమాండ్ల వల్ల చర్చలు ఆలస్యం అయ్యాయని ఆయన తెలిపారు. ప్రతి అంశంపైనా లోతుగా చర్చించామని అన్నారు.

Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు

”పీఆర్సీ రిపోర్టు అడిగారు.. జీవో ఇవ్వగానే రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది.. ఫిట్ మెంట్ 23 శాతంలో ఎలాంటి మార్పు లేదు. 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో 16 శాతం HRA ఇవ్వడానికి అంగీకరించారు. HOD, సచివాలయంలో ఉద్యోగులకు జూన్ 2024 వరకూ 24 శాతం HRA ఇవ్వడానికి అంగీకారం. పెన్షనర్ల 70 నుండి 74 వారికి 7 శాతం.. 74 నుండి 79 శాతం 12 శాతం. పీఆర్సీ ఐదేళ్ల పాత పద్దతి కొనసాగుతుంది. CCL పాత రేట్లు ప్రకారమే కొనసాగుతుంది. ఆర్టీసీ, యూనివర్సిటీలకు సెపరేట్ పీఆర్సీ జీవో విడుదల అవుతుంది” అని సజ్జల తెలిపారు.