MLA Haripriya : మా నాయకులు, మంత్రి పువ్వాడను విమర్శిస్తే సహించం.. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యని హెచ్చరించిన ఎమ్మెల్యే హరిప్రియ

ఇసుక క్వారీలే లేని ఇల్లందు నియోజకవర్గంలో ఇసుక దందాలు చేస్తున్నారని ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లా మొత్తం పదవితో తిరుగుతున్న వారు ఎవరో గ్రహించాలన్నారు.

MLA Haripriya : మా నాయకులు, మంత్రి పువ్వాడను విమర్శిస్తే సహించం.. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యని హెచ్చరించిన ఎమ్మెల్యే హరిప్రియ

Haripriya

Haripriya – Koram Kanakaiah : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యపై ఎమ్మెల్యే హరిప్రియ తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే హరిప్రియలపై చేసిన కోరం కనకయ్య వ్యాఖ్యలపై ఎమ్మెల్యే హరిప్రియ స్పందించారు. తమ నాయకులను గానీ, మంత్రి పువ్వాడను గానీ విమర్శిస్తే సహించబోమని.. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యని ఉద్దేశించి ఎమ్మెల్యే హరిప్రియ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెంలో ఎమ్మెల్యే హరిప్రియ మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీని మోసం చేశానని చెబుతున్న మీరు మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా పోటీ చేయాలని ఆశిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏం సాధించారని? ఏం అభివృద్ధి చేశారని… ఈ ప్రాంతానికి సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థిగా లేని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు చెప్పుకొని ఎలా ప్రచారం చేస్తారు? అని ప్రశ్నించారు. ‘ఐదేళ్ల మీ ఎమ్మెల్యే పదవీకాలంలో సీతారామ ప్రాజెక్టు గురించి గానీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి గానీ ఏనాడు ఎందుకు మాట్లాడలేదు? 2/3 సభ్యులతో కలిసి మేము రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 10 ప్రకారం పార్టీ మారాం.. ఇది పార్టీ ఫిరాయింపుల కిందికి రాదు అన్న విషయం గ్రహించాలి’ అని అన్నారు.

TSPSC Paper Leakage : ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం.. ప్రమేయమున్న 37 మంది డిబార్

‘ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను బీఆర్ఎస్ లోకి వచ్చానని, నేను చేసిన అభివృద్ధే కనిపిస్తుందన్నారు. సమయం వచ్చినప్పుడు జడ్పీటీసీలే మిమ్మల్ని గద్దె దింపుతారు’ అని పేర్కొన్నారు. ఇల్లందుకు బస్సు డిపో రావడానికి, సీతారామ ప్రాజెక్టు సర్వే కోసం సహకరించిన మంత్రిపై విమర్శలు చేయడం తగదు అన్నారు. ఎందరో వచ్చి పోయారు కానీ, ఇల్లందు అభివృద్ధిని ఎవరు పట్టించుకోలేదని విమర్శించారు.

‘మీ కాలంలో ఇల్లందు మునిసిపాలిటీ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎందుకు గుర్తింపు తేలేకపోయారు? ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడిపోయి ఇంట్లో ఉన్న మిమ్మల్ని లేపి తీసుకువచ్చి జడ్పీ చైర్మన్ చేసిన పార్టీపై విమర్శలు తగవు’ అని హితవు పలికారు.
బయ్యారం మండలంలో సర్పంచులను రెచ్చగొట్టి సీసీ రోడ్లకు తీర్మానాలు కూడా రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెడికల్ కాలేజీ లేని సమయంలో కాలేజీ ఏర్పాటు చేసే ఎందరినో వైద్య నిపుణులుగా తయారు చేసిన విద్యా సంస్థపై ఆరోపణలు తగవు అన్నారు.

TG Venkatesh : పవన్ కల్యాణ్ చంద్రబాబుకి దగ్గరవడానికి కారణం సీఎం జగన్- టీజీ వెంకటేశ్

ఇసుక క్వారీలే లేని ఇల్లందు నియోజకవర్గంలో ఇసుక దందాలు చేస్తున్నారని ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లా మొత్తం పదవితో తిరుగుతున్న వారు ఎవరో గ్రహించాలన్నారు. సీతారామ జలాలు ఇల్లందు నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి వచ్చేలా సర్వే జరుగుతుందని చెప్పారు. సర్వే చేస్తున్న కంపెనీ ఈ ప్రాంతంలోనే ఉందన్న విషయాన్ని కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘ఇది ఇల్లందు నియోజకవర్గ రైతులందరికీ సంబంధించిన సర్వే… మీ ఇంటి, మా ఇంటి సర్వే కాదు’ అని స్పష్టం చేశారు.