Monsoons: రైతులకు గుడ్‌న్యూస్.. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. మరో మూడు రోజుల్లో..

కేరళ భూభాగంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. మరో మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించచనున్నాయి

Monsoons: రైతులకు గుడ్‌న్యూస్.. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. మరో మూడు రోజుల్లో..

Southwest Monsoon

Andhra Pradesh: : కేరళ (Kerala) భూభాగంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. కర్ణాటక  (Karnataka) , తమిళనాడు (Tamil Nadu) లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు (Monsoons) దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. అనంతపురం మీదుగా రాయలసీమ (Rayalaseema) , కోస్తాంధ్ర జిల్లాలను రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ఈ ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Boost Immunity During Monsoons : వర్షకాలంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడే పండ్లు, కూరగాయలు ఇవే!

ఇదిలాఉంటే.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏపీలోని ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న రెండు రోజులు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా వడ గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, ఈదురు గాలులు గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.   నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. దీంతో వానాకాలం ప్రారంభమైందని భావిస్తారు.

Andhra Pradesh: మరింత ముందుకు నైరుతి రుతుపవనాలు.. ఏపీకి వర్ష సూచన

మరోవైపు జూన్ రెండోవారం మొదలైనా భానుడి ప్రతాపం కొనసాగుతోంది. రోహిణి కార్తె వెళ్లాక వచ్చే మృగశిర కార్తెతో వాతావరణం చల్లబడుతుంది. కానీ ప్రస్తుతం మృగశిర కార్తె ప్రవేశించినా రోహిణి కార్తె ఎండలనే తలపిస్తోంది. శుక్రవారం ఏపీలోని పలు జిల్లాల్లో అత్యధి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో అత్యధికంగా 45.5. డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా విజయనగరం, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, మరో నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.