Nallari Kishore Kumar Reddy : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి : నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి

అటవీ భూములను ప్రాజెక్ట్ కోసం వినియోగిస్తూ ఆ శాఖ అనుమతి లేకుండా పనులు చేయడంలోని ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం ముసుగులో జగన్ ప్రభుత్వం అనుసరించిన దోపిడీ విధానం మరోసారి రుజువైందని పేర్కొన్నారు.

Nallari Kishore Kumar Reddy : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి : నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి

Nallari Kishore Kumar Reddy

Nallari Kishore Kumar Reddy demand : కమిషన్ల కక్కుర్తితో ఆవులపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో రైతుల జీవితాలతో ఆటలాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని టీడీపీ నేత నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎలాంటి అనుమతలు లేకుండా కంటితుడుపు చర్యగా జగన్ ప్రభుత్వం ఆవులపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం రైతుల్ని వంచించడం కాదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఆవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్లకు సంబంధించిన పనులు నిలిపివేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు జగన్ కు, మంత్రి పెద్దిరెడ్డికి చెంపపెట్టే అని అన్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 3.5టీఎంసీలు అయితే, 2.5టీఎంసీలకే ఈసీ తీసుకోవడం చట్ట విరుద్ధం కాదా? దానిపై మంత్రి పెద్దిరెడ్డి స్పందనేంటో చెప్పాలన్నారు.

Chandrababu : రాజధాని పేరుతో జగన్ నాటకాలు.. ఏపీ క్యాపిటల్ అమరావతే : చంద్రబాబు

అటవీ భూములను ప్రాజెక్ట్ కోసం వినియోగిస్తూ ఆ శాఖ అనుమతి లేకుండా పనులు చేయడంలోని ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం ముసుగులో జగన్ ప్రభుత్వం అనుసరించిన దోపిడీ విధానం మరోసారి రుజువైందని పేర్కొన్నారు.

ఆవులపల్లి ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎన్జీటీ వాదనని సమర్థిస్తూ సుప్రీంకోర్టు రూ.100కోట్ల జరిమానాలో తక్షణమే రూ.25కోట్లు ఎన్జీటీకి జమ చేయాలన్న న్యాయస్థానం తీర్పు జగన్, పెద్దిరెడ్డి ఆడిన నాటకానికి ముగింపు అని అన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో జగన్ ప్రభుత్వం ఆడిన నాటకాలను బయటపెట్టి, తమ భూముల కోసం పోరాడిన రైతాంగాన్ని తెలుగుదేశం పార్టీ అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.