Nara Lokesh : అప్పుడు బాబాయ్‌కి గుండెపోటు అన్నారు, ఇప్పుడు తల్లికి గుండెపోటు అంటున్నారు- చాలా భయంగా ఉందన్న లోకేశ్

Nara Lokesh : అవినాశ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడింది. త్వరలోనే బాబాయ్ మర్డర్ కేసులో మాస్టర్ మైండ్స్ కూడా జైలుకి పోవడం ఖాయం.

Nara Lokesh : అప్పుడు బాబాయ్‌కి గుండెపోటు అన్నారు, ఇప్పుడు తల్లికి గుండెపోటు అంటున్నారు- చాలా భయంగా ఉందన్న లోకేశ్

Nara Lokesh (Photo : Twitter)

Nara Lokesh – YS Avinash Reddy : టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోది. ఆళ్లగడ్డ బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డిపై పైర్ అయ్యారు. టీడీపీ ఘన చరిత్ర ఉన్న పార్టీ అని, వైసీపీ గజ దొంగల పార్టీ అని లోకేశ్ అన్నారు. అప్పుడు బాబాయ్ కి గుండెపోటు అన్నారు. ఇప్పుడు తల్లికి గుండెపోటు అంటున్నారు అని విమర్శించారు. వీళ్ల స్వార్ధ రాజకీయం కోసం ఆ తల్లిని ఏం చేస్తారో అని భయం వేస్తుందన్నారు. ఆ తల్లిని ఏదైనా చేసి ఆ నెపం నాపై నెడతారని లోకేశ్ అన్నారు. ఆ తల్లిని దేవుడు కాపాడాలని కోరుకుంటున్నా అని చెప్పారు.

” అవినాశ్ స్టోరీ కి ఎండ్ కార్డ్ పడింది. త్వరలోనే బాబాయ్ మర్డర్ కేసులో మాస్టర్ మైండ్స్ కూడా జైలుకి పోవడం ఖాయం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించండి. మీరు కోట్లు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. మీకిప్పుడు వైసిపిలో కనీస గౌరవం దక్కుతుందా? ఒక్క టీడీపీలోనే అందరికీ గౌరవం దక్కుతుంది.(Nara Lokesh)

Also Read..Sajjala Ramakrishna Reddy : అందుకే.. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు : సజ్జల రామకృష్ణారెడ్డి

ఆళ్లగడ్డను అద్భుతంగా అభివృద్ధి చేస్తాడని 2019 ఎన్నికల్లో గంగుల బ్రిజేంద్ర రెడ్డి అలియాస్ గంగుల నానిని మీరు భారీ మెజారిటీ తో గెలిపించారు. అతనో చేతగాని ఎమ్మెల్యే. ఆళ్లగడ్డను అడ్డంగా దోచుకోవడం తప్ప చేసింది ఏమైనా ఉందా? అందుకే ఆయన పేరు మార్చాను. ఆయన గంగుల నాని కాదు లూటీ నాని. లూటీ నాని స్వయంగా ఇంటినే సెటిల్మెంట్ డెన్ గా మార్చేసుకున్నాడు.

ఆళ్లగడ్డలో ఐ ట్యాక్స్ అంటే అందరికి బాగా తెలుసు. మహిళల్ని మనం గౌరవించాలని పేరు చెప్పడం లేదు. కానీ ఐ ట్యాక్స్ తో మీరు పడుతున్న ఇబ్బందులు అన్నీ నాకు తెలుసు. ఇసుక, ఎర్రమట్టి, కాంట్రాక్టులు, లిక్కర్ దందా, అక్రమ బియ్యం రవాణ.. ఇలా ప్రతి దాంట్లో లూటీ చేస్తూ లూటీ నాని దాదాపు 200 ఎకరాలు కొన్నాడని వైసిపి నాయకులు, కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు.

లూటీ నాని అనుచరుడు రాఘవేంద్రారెడ్డి రామతీర్ధం కొండలను తవ్వేసి ఎర్రమట్టి అక్రమ రవాణ చేస్తున్నాడు. ఆళ్లగడ్డలో ఇసుక డిపో పెట్టారు. 8వేల టన్నుల ఇసుకను దోచేశారు. లూటీ నాని అనుచరులు ఎర్రచందనం అక్రమ రవాణ చేస్తున్నారు. సిరువెళ్ల మండలంలో లూటీ నాని, ఆయన అనుచరులు భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్స్ కి పాల్పడుతున్నారు. రైతులు పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. బోయలకుంట్ల గ్రామంలో ఓ బ్రాహ్మణుడి భూమిని లాక్కొని రైతు భరోసా కేంద్రం కట్టారు.(Nara Lokesh)

Also Read..Chiranjeevi : రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డికి బదులు చిరంజీవి సీఎం కావాలి, కానీ .. అందుకే కాలేదు : చింతా మోహన్

లూటీ నాని, అనుచరులు కలిసి ఆళ్లగడ్డను అక్రమ బియ్యం రవాణకు అడ్డాగా మార్చేశారు. లూటీ నాని, అనుచరులు కలిసి మున్సిపాలిటీ సెస్ పేరుతో ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు. ఆఖరికి దేవుడ్ని కూడా వదల లేదు. లూటీ నాని అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దందా చేస్తున్నారు. అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పెత్తనం చెయ్యాలని వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది.

సిరువెళ్లలో పేరుకే దళిత సర్పంచి.. అక్కడ పెత్తనం అంతా ఎమ్మెల్యే అనుచరులదే. వారి వేధింపులకు ప్రజలు భయపడిపోతున్నారు. లూటీ నాని అభివృద్ధి చెయ్యడు వేరే వాళ్ళు చేసినవి ఉంచడు. ఆళ్లగడ్డలో దివంగత భూమా నాగిరెడ్డి ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ కడితే.. ఆయనకు పేరు వస్తుందని డ్రైనేజీ నిర్మాణం పేరుతో బస్ షెల్టర్ కూల్చారు. జగన్ పాలనలో నిధులు లేక అభివృద్ధి చేయలేకపోతున్నాం అని మున్సిపల్ చైర్మన్ ప్రతి సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డను లూటీ చెయ్యడంలో ఉన్న శ్రద్ద నిధులు తేవడం పట్ల పెట్టలేదు లూటీ నాని.

ఆళ్లగడ్డను అభివృద్ధి చేసిన భూమా కుటుంబాన్ని జగన్ వేధిస్తున్నారు. తల్లి, తండ్రి లేని పిల్లల్ని జగన్ ఇబ్బంది పెడుతున్నారు. ఆళ్లగడ్డ ఆడపులి అఖిలప్రియ మీ తరపున పోరాడుతుంది. త్వరలోనే మన ఆడపులి బయటకు వస్తుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అఖిలప్రియ మీ కోసం పోరాడుతూనే ఉంటుంది. మీ తరపున పోరాడుతున్న విఖ్యాత్ రెడ్డి మీద కేసులు పెట్టి వేధించారు” అని నారా లోకేశ్ అన్నారు.