CPI Meetings: ఢిల్లీలో మూడు రోజుల పాటు సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలు సహా దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీపీఐ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు.

CPI Meetings: ఢిల్లీలో మూడు రోజుల పాటు సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు

Cpi

CPI Meetings: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలు సహా దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీపీఐ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు జాతీయ స్థాయి నేతలతో పాటు వివిధ రాష్ట్రాల కార్యదర్శులు సైతం హాజరుకానున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కార్యదర్శులు కూడా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనున్నట్లు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి తెలిపారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో..ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చ జరిగిందని.. బీజేపీని, ఎన్డీయేను ఎదుర్కోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చాడ తెలిపారు.

Also Read: Brother Anil Kumar: క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో బ్రదర్ అనిల్ సమావేశం

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టం అమలు చేయాల్సింది పోయి, తెలుగు రాష్ట్రాల పై పెత్తనం చేసే ప్రయత్నం చేస్తోందని చాడ వెంకట రెడ్డి దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన వాటా పై పోరాడాలని..రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాల్సిందిపోయి గెజిట్ ద్వారా కేంద్రం పెత్తనం చేస్తోందని ఆయన విమర్శించారు. కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన గెజిట్ ను రద్దు చేయాలని పోరాటం చేస్తామని సీపీఐ నేతలు తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు కోసం కాకుండా, ప్రజల ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేస్తామని చాడ వెంకట రెడ్డి పేర్కొన్నారు.

Also Read: CM Jagan : మద్యపానం తగ్గించాలన్నదే మా లక్ష్యం : సీఎం జగన్

ఈసమావేశంలో సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ ఎన్డీయే విధానాలు సరిగ్గా లేవని అన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ నియంతృత్వ పాలన కొనసాగుతోందని.. అందుకు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఒక్క వేదికపైకి రావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వ విధానాలను సీపీఐ ఖండిస్తుందని రామకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పరమైన సభ పెట్టుకుంటే, పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారన్న రామకృష్ణ.. ఏపీలో పోలీసులు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీలను తొక్కిపడేయాలన్న జగన్ ఆలోచన రాష్ట్రానికే చేటని రామకృష్ణ అన్నారు. పోలీసులతో ప్రజా ఉద్యమాలు అణిచివేయ్యలేరని ఈ విషయంలో ఏపీ సీఎంను హెచ్చరిస్తున్నామని రామకృష్ణ తెలిపారు.

Also read: Telangana CS Somesh Kumar : సీఎస్ సోమేష్ కుమార్ కేసులపై సీజేఐకి లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే