Thopudurthi Prakash Reddy : పరిటాల కుటుంబం పారిపోయింది, రాప్తాడుకు టీడీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి- వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

Thopudurthi Prakash Reddy : పరిటాల కుటుంబం ఏరోజూ ప్రజలకు అందుబాటులో దు. టీడీపీ ప్రభుత్వంలో అన్నీ దోపిడీ చేశారు.

Thopudurthi Prakash Reddy : పరిటాల కుటుంబం పారిపోయింది, రాప్తాడుకు టీడీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి- వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

Thopudurthi Prakash Reddy (Photo : Twitter)

Updated On : July 2, 2023 / 8:04 PM IST

Thopudurthi Prakash Reddy – Paritala Sunitha : అనంతపురం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాజీమంత్రి పరిటాల సునీతను టార్గెట్ చేశారు. సునీత లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడుకు టీడీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి వస్తాడు అని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి జోస్యం చెప్పారు.

” పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గం వదిలేసి ధర్మవరం పారిపోయింది. రాబోయే ఎన్నికల్లో రాప్తాడుకు టీడీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి వస్తాడు. పరిటాల సునీత పెనుకొండకు వెళ్తారు. పరిటాల శ్రీరామ్ కు డీల్ కుదిరితే.. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీ చేస్తారు. ధర్మవరంలో సీటు కుదరకపోతే పరిటాల శ్రీరామ్ అప్పుడు రాప్తాడు వస్తాడు.

Also Read..Rahul Gandhi: తెలంగాణలో వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పింఛను ప్రకటిస్తున్నా.. ఇంకా..: రాహుల్‌ హామీలు

నాలుగేళ్ళుగా రాప్తాడులో పరిటాల కుటుంబం ఉనికి కోల్పోతోంది. అందుకే ధర్మవరం పారిపోయారు. పరిటాల కుటుంబం ఏరోజూ ప్రజలకు అందుబాటులో లేదు. టీడీపీ ప్రభుత్వంలో అన్నీ దోపిడీ చేశారు. మా ప్రభుత్వం ఇళ్ళ పట్టాల పంపిణీకీ సిద్ధమవుతుంటే.. టీడీపీ కోర్టుకెళ్లి స్టే తెచ్చి ఇళ్ళ నిర్మాణాలను అడ్డుకుంటున్నారు.

అన్ని కులాల వారికి ఇళ్ళ స్థలాలు ఇచ్చాం. కులాల పేరుతో మాపై దుర్భాషలాడుతున్నారు. మాపై ఆరోపణలు చేసే వారికి బుర్ర ఉందా? మేము దళితులను బెదిరించామని కొంతమంది తప్పుడు కూతలు కూస్తున్నారు” అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు.

Also Read..Atchenaidu : వైసీపీ నేతలు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు : అచ్చెన్నాయుడు