AP Night Curfew : ఏపీలో నైట్ కర్ఫ్యూ…మళ్లీ నిబంధనలు విధించిన ప్రభుత్వం

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా పలు నిబంధనలు మళ్లీ అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

AP Night Curfew : ఏపీలో నైట్ కర్ఫ్యూ…మళ్లీ నిబంధనలు విధించిన ప్రభుత్వం

AP Night Curfew : భారతదేశాన్ని కరోనా ఇంకా భయపెడుతూనే ఉంది. కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికమౌతుండడంతో కఠినమైన ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా పలు నిబంధనలు మళ్లీ అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

Read More : Shobana : సీనియర్ నటి శోభనకి ఒమిక్రాన్..

2022, జనవరి 10వ తేదీ సోమవారం కోవిడ్ వ్యాప్తిపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైరస్ ఉధృతి గురించి అధికారులు వివరించారు. బాధితులకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లు కూడా సిద్ధం చేయాలని, నియోజకవర్గానికి ఒక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Read More : TRS Rythu Bandhu : టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్-పురపాలకశాఖ మంత్రి కేటీఆర్

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుదని తెలిపింది.
సినిమా థియేటర్స్ లు, మాల్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ ఉండేలా చూసుకోవాలిన యాజమాన్యాలకు సూచించింది.
థియేటర్లలో సీటు మార్చి..సీటులో ప్రేక్షకులను కూర్చొనే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
భౌతిక దూరం, మాస్క్ లు కచ్చితంగా ధరించేలా చూడాలని, ఒకవేళ నిబంధనలు పాటించకపోతే…జరిమానాలు కొనసాగించాలని తెలిపింది.

Read More : Sankranthi Brahmotsavalu : జనవరి 12 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి మించకూడదని షరతు విధించింది.
ఇండోర్ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదని పేర్కొంది.
త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేస్తుందని వెల్లడించింది.