Andhra Pradesh Night Curfew: బ్రేకింగ్.. ఏపీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ, ఉచితంగా వ్యాక్సిన్.. సీఎం జగన్ కీలక నిర్ణయాలు

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేపటి(ఏప్రిల్ 24,2021) నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి

Andhra Pradesh Night Curfew: బ్రేకింగ్.. ఏపీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ, ఉచితంగా వ్యాక్సిన్.. సీఎం జగన్ కీలక నిర్ణయాలు

Ap Night Curfew

Andhra Pradesh Night Curfew : కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేపటి(ఏప్రిల్ 24,2021) నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో బయటకు వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు తప్ప అన్నివ్యాపార కార్యకలాపాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం చెప్పింది.

ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ శుక్రవారం(ఏప్రిల్ 23,2021) సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కట్టడి కోసం నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్ర అవసరాల మేరకు వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. వ్యాక్సిన్లు, మందులు రాష్ట్రానికి పంపాల్సిందిగా కంపెనీలను కోరారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, హెటిరో డ్రగ్స్ ఎండీ పార్థసారథిలతో సీఎం జగన్ ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్ర అవసరాలకు సరిపడ వ్యాక్సిన్లు, మందులు పంపాలని వారికి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో 18ఏళ్లు దాటిన వారందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు.

వ్యాక్సిన్ ఫ్రీ..
మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, వ్యాక్సిన్ పంపిణీపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 18ఏళ్లు పైబడిన వారికి ఉచితంగానే టీకా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో 18-45 ఏళ్లు వయసు పైబడిన 2 కోట్ల మందికి ఉచితంగా టీకా అందనుంది. కాగా, 18ఏళ్లు పైబడిన వారికి ఈ నెల 28 నుంచి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది.