Maestro: గుమ్మడికాయ కొట్టేసిన నితిన్.. థియేటర్ల కోసమే వెయిటింగ్!

యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది మరే హీరోకు అందనంత స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు. ఒకవైపు కరోనా లాక్ డౌన్.. మరోవైపు థియేటర్ల మూతపడడంతో చాలా సినిమాలు వెనక్కి వెనక్కి వెళ్తూనే ఉన్నాయి. అందులో బడా బడా హీరోల సినిమాలు కూడా ఉండగా యంగ్ హీరో నితిన్ మాత్రం ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేయగా..

Maestro: గుమ్మడికాయ కొట్టేసిన నితిన్.. థియేటర్ల కోసమే వెయిటింగ్!

Nithin Maestro Shooting Completed

Maestro: యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది మరే హీరోకు అందనంత స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు. ఒకవైపు కరోనా లాక్ డౌన్.. మరోవైపు థియేటర్ల మూతపడడంతో చాలా సినిమాలు వెనక్కి వెనక్కి వెళ్తూనే ఉన్నాయి. అందులో బడా బడా హీరోల సినిమాలు కూడా ఉండగా యంగ్ హీరో నితిన్ మాత్రం ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేయగా తాజాగా మూడవ సినిమాను కూడా పూర్తిచేసి గుమ్మడి కాయ కొట్టేశాడు. ఇక థియేటర్స్ ఎప్పుడు మొదలైతే అప్పుడు ముహూర్తం చూసి మూడవ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.

నితిన్ ఈ ఏడాది ఇప్పటికే చెక్, రంగ్ దే సినిమాలు విడుదల కాగా ఇప్పుడు త్వరలో మాస్ట్రో సినిమా కూడా విడుదల కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ హిట్ చిత్రం అంధధూన్ కి రీమేక్. ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ గా టీజర్ గ్లింప్స్, పోస్టర్స్ తో మంచి హైప్ తీసుకురాగా లాక్ డౌన్ కు ముందే లాస్ట్ షెడ్యూల్ మినహా సినిమా షూటింగ్ పూర్తిచేశారు. కాగా.. ఈ లాక్ డౌన్ లో ఆంక్షల సడలింపులోనే ఆ చివరి షెడ్యూల్ కూడా పూర్తి చేసి మొత్తానికి గుమ్మడి కాయ కొట్టేశారు.

నితిన్ జోడిగా నభా నటేష్ నటించిన ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రలో నటిస్తుంది. చివరి షెడ్యూల్ లోనే ఈ కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లుగా సినిమా యూనిట్ కన్ఫర్మ్ చేసింది. మహతి సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మిస్తుండగా నితిన్ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి విడుదల తేదీ.. ఎప్పుడో ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.