కాంగ్రెస్ భరోసా : ప్రత్యేక హోదాను ఏ శక్తీ ఆపలేదు

  • Published By: venkaiahnaidu ,Published On : February 22, 2019 / 12:47 PM IST
కాంగ్రెస్ భరోసా : ప్రత్యేక హోదాను ఏ శక్తీ ఆపలేదు

ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం(ఫిబ్రవరి-22,2019) తిరుపతి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం..తిరుపతిలోని తారకరామా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని ఒక మాట ఇచ్చారని, ఏదో ఒక వ్యక్తి ఇచ్చిన మాట కాదని, ప్రధానమంత్రి ఒక వ్యక్తి మాత్రమే కాదని, సామాన్య ప్రజలకు ఒక గొంతుగా పని చేసిన వాడే ప్రధాని అని, కేవలం ఒక ప్రధాని ఇచ్చిన వాగ్ధానం కాదని, ఈ దేశంలోని ప్రతి పౌరుడు కూడా ఇచ్చిన వాగ్ధానంగా తాను భావిస్తున్నానన్నారు. మన్మోహన్ సింగ్, నరేంద్రమోడీనో ప్రధానులుగా కాదు భారతదేశమే ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులకు భారతప్రభుత్వం ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని తాను చెబుతానన్నారు.

 2019లో ఢిల్లీలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చని వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రపంచంలోని ఏ శక్తీ ఆపలేదని రాహుల్ అన్నారు. ప్రధాని హామీని తాము అమలుపర్చడం లేదని, 125 కోట్ల మంది ప్రజల మాటను అమలుపరుస్తామన్నారు.ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది తాము చూడమని, ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామన్నారు. ఇదే స్టేడియంలో 2014 ఎన్నికల ప్రచారసమయంలో ప్రధాని మోడీ ఏపీకి 10 ఏళ్లు  ప్రత్యేక హోదా ఇస్తానని, ప్రతి ఒక్కరి అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తానని, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని అన్నాడని రాహుల్ గుర్తుచేశారు. మేక్ ఇన్ ఇండియా, సిట్ డౌన్ ఇండియా,స్టార్టప్ ఇండియా, లుక్ లెఫ్ట్ ఇండియా  అంటూ కహానీలు చెబుతున్నాడు కానీ ఒక్క హామీ కేూడా నెరవేర్చలేదని, మోడీ అన్ని అబద్దాలు చెప్పారన్నారు.

అవినీతిపై పోరాటం చేస్తానని ఇదే స్టేడియం వేదికగా చెప్పాడని, కాపాలదారుడిగా ఉంటానని చెప్పి దొంగలకు కాపాలాదారుడిగా ఉన్నారన్నారు. చౌకీదార్ చోర్ అయ్యాడని అన్నారు.రాఫేల్ యుద్ధ విమానాల డీల్ లో 30వేల కోట్ల రూపాయలు అనీల్ అంబానీకి దోచి పెట్టారని అన్నారు.  ఎవరైనా చెప్పిన మాటకు నిబ్ధత లేకుంటే దానికి విలువ ఉందన్నారు.రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పి రైతులను మోడీ మోసం చేశారన్నారు.