Anitha Vangalapudi : 6 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, మేమెంటో చూపిస్తాం- అనిత స్ట్రాంగ్ వార్నింగ్

Anitha Vangalapudi : జగన్ భజన చేయడం తప్ప మహిళల సమస్యలు పట్టవా?

Anitha Vangalapudi : 6 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, మేమెంటో చూపిస్తాం- అనిత స్ట్రాంగ్ వార్నింగ్

Anitha Vangalapudi (Photo : Google)

Updated On : June 18, 2023 / 9:07 PM IST

Anitha Vangalapudi – YSRCP : ఏలూరులో యాసిడ్ దాడికి గురైన మహిళను పరామర్శించేందుకు మణిపాల్ హాస్పిటల్ కి వెళ్లిన తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆమె సీరియస్ గా స్పందించారు.

జగన్ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ఆడవాళ్ళని రక్షించలేని దుర్మార్గ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల క్రైమ్ రిపోర్టులో ఆడవాళ్లపై దాడులు పెరిగాయని అనిత చెప్పారు. ఆడవాళ్లు బయటికి రావడానికే కాదు.. ఇళ్లలో ఉండటానికి కూడా భయపడుతున్నారని అన్నారు. సొంత తల్లిని, చెల్లిని బయటికి గెంటిన వ్యక్తి సీఎం జగన్ అని విమర్శించారు.

Also Read..GVL Narasimha Rao : రాష్ట్రంలో ప్రమాదకర స్థితిలో శాంతిభద్రతలు : ఎంపీ జీవీఎల్

” ఏలూరు SP ప్రశాంతి చేతులెత్తి మొక్కుతా. మెరుగైన వైద్యం కోసం వెంటనే స్పందించారు. హోంమంత్రి ఓ మహిళ. కూతవేటు దూరంలో మహిళా కమిషన్ ఉంది. మరి ఎందుకు బాధితురాలిని చూడనికి రాలేదు? జగన్ భజన చేయడం తప్ప మహిళల సమస్యలు పట్టవా?

దిశ చట్టం ప్రకారం నిందితులను ఉరి తీసే దమ్ముందా? ఆడపిల్లను ఎందుకు కన్నామా అని భయపడుతున్నా. వైఎస్ భారతిని అంటే డీజీపీకి లేఖ ఇచ్చే మహిళా కమిషన్ సభ్యురాలికి మహిళల ఇబ్బందులు పట్టవా? రాష్ట్రంలో జగన్ కమిషన్ ఉంది తప్ప మహిళ కమిషన్ లేదు. 6 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మేమెంటో చూపిస్తాం” అని అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇటీవల ఏలూరులో దారుణం జరిగింది. ఓ మహిళపై యాసిడ్ దాడి చేశారు దుండగులు. బాధితురాలు ప్రైవేట్ డెంటల్ క్లినిక్ లో రిసెప్షనిస్టుగా పని చేస్తుంది. 13వ తేదీన డ్యూటీ ముగించుకుని తన స్కూటర్ పై ఇంటికి వెళ్తుండగా.. రాత్రి 9గంటల సమయంలో ఇద్దరు దుండగులు ఆమెపై యాసిడ్ తో దాడి చేశారు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. కంటిచూపు కోల్పోయింది. యాసిడ్ దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

Also Read..Aravind Sasikumar : లండన్‌లో భారత సంతతి వ్యక్తి కత్తితో పొడిచి దారుణ హత్య.. మూడు రోజుల్లో రెండో ఘటన

బాధితురాలి పేరు యడ్ల ప్రాంచిక (35). ఏలూరులోని విద్యానగర్‌ మానిస్ట్రీ దగ్గర నివాసం ఉంటుంది. భర్త ఆంజనేయులుతో గొడవ కారణంగా ఏడాదిగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ప్రాంచిక తన ఐదేళ్ల కూతురితో పుట్టింటి వారితోనే ఉంటుంది. 2 నెలల క్రితం విద్యానగర్‌లో ఒక డెంటల్‌ క్లినిక్‌లో రిసెప్షనిస్ట్ గా చేరింది. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్యూటీ ముగించుకుని తన స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా ఇంటి సమీపంలోని మానిస్ట్రీ దగ్గర బైక్ పై ఆగి ఉన్న గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా ప్రాంచికపై యాసిడ్‌ పోశారు.