Perni Nani : దిక్కుమాలిన రాజకీయాల కోసం వాలంటీర్లపై నీచమైన మాటలా..? : పేర్ని నాని

పవన్ కళ్యాణ్ ది రాక్షస రాజకీయ ఎత్తుగడ..పవన్ మాటల్లో జగన్ పై ద్వేషం.. చంద్రబాబుపై ప్రేమ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చెప్తున్న NCB అంటే నారా చంద్రబాబు లెక్కలు.

Perni Nani : దిక్కుమాలిన రాజకీయాల కోసం వాలంటీర్లపై నీచమైన మాటలా..? : పేర్ని నాని

MLA Perni Nani

Updated On : July 10, 2023 / 8:03 PM IST

Perni Nani – Pawan kalyan: వారాహి (Varahi) రెండో విడత యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్  ఏలూరు (Eluru)లో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వాలంటీర్ల (Volunteers)పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కాకపుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ (Missing AP Women) అవటానికి వాలంటీర్ వ్యవస్థ (Volunteer system) పని చేస్తోంది అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు (YCP Leaders) తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంట్లో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) పవన్ పై మండిపడ్డారు. పవన్ ప్రభుత్వం (YCP Govt)పై విషం చిమ్ముతున్నారంటూ మండిపడ్డారు. జగన్ ను ఎదుర్కొనే దమ్ములేక వాలంటీర్లపై హద్దు పద్దు లేకుండా ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ ది రాక్షస రాజకీయ ఎత్తుగడ.. పవన్ మాటల్లో జగన్ పై ద్వేషం.. చంద్రబాబుపై ప్రేమ కనిపిస్తుందంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ చెప్తున్న NCB అంటే నారా చంద్రబాబు లెక్కలు అంటూ ఎద్దేవా చేశారు. 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని తప్పుడు లెక్కలు చెప్తున్నారంటూ మండిపడ్డారు. పవన్ విషం కక్కుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇది ధర్మమా.. నీతి అంటావ్, నిజాయితీ అంటావ్.. ఇదేనా నీ నీతి? అంటూ ప్రశ్నించారు. వాలంటీర్లు అమ్మాయిలను అమ్మేస్తున్నారని దుర్మార్గంగా మాట్లాడుతున్నారనీ.. వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తామని దమ్ముంటే మీ ఎన్నికల మ్యానిపెస్టోలో పెట్టండి అంటూ సవాల్ విసిరారు.

పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్ నోటీసులు,10 రోజుల్లో లెక్కలతో సహా వివరణ ఇవ్వాలని ఆదేశం

వాలంటీర్లలో అధిక శాతం మహిళలే ఉన్నారని వారంతా సేవాభావంతో పని చేస్తున్నారని అన్నారు. మనిషి జన్మ యెత్తినవాడు ఎవరూ వాలంటీర్లను నీచంగా మాట్లాడరని, అటువంటిది వపన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. పవన్ జన్మలో ఇదే హేయమైన చర్య.. దిక్కుమాలిన రాజకీయాల కోసం వాలంటీర్ల పై నీచమైన మాటలు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్ కళ్యాణ్ కు విజ్ఞత ఉంటే వాలంటీర్లకు క్షమాపణ చెప్పి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను వైసీపీ ఏనాడూ ఒక్క మాట అనలేదు.. అలాంటి తప్పుడు పనులు చేసే అలవాటు వైసీపీకి లేదన్నారు. 2.50 లక్షల వాలంటీర్ల వ్యక్తిత్వం కించపరిచేలా పవన్ మాట్లాడొచ్చా..? అంటూ ప్రశ్నించారు.

కాపు ఓట్లు జగన్ కి రాకుండా చంద్రబాబుకి మళ్లించటానికి పవన్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2019 లోనూ పవన్ అదే చేశారని, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని.. దాంట్లో భాగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కులాల కుంపట్లు పెట్టి చంద్రబాబును గెలిపించాలని పవన్ అన్ని సర్కస్ లు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ను ఏకవచనంతో పిలవడంపై పవన్ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఏకవచనంతో పలికి చూడు మేము ఏ వచనంతో పలుకుతామో చూడు.. పవన్ కి ఒక్కడికే కాదు నోరు ఉన్నది.. మాకు ఉంది అంటూ పేర్ని నాని.. పవన్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

Alla Nani : కేంద్ర నిఘా వ్యవస్థ పవన్ చుట్టూ ఉందా?.. పవన్ చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నాడు