Pawan Kalyan PM Modi Meeting : ఏపీలో మంచి రోజులు వస్తాయి -ప్రధానితో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన సమావేశం ఇది అని పవన్ అన్నారు. ప్రధానితో భేటీతో ఏపీకి మంచి జరగబోతోందని, భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Pawan Kalyan PM Modi Meeting : ఏపీలో మంచి రోజులు వస్తాయి -ప్రధానితో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan PM Modi Meeting : ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం జనసేనాని అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ సమావేశం. విశాఖపట్నం పర్యటన కోసం వచ్చిన ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ కలిశారు. ప్రధానితో శుక్రవారం రాత్రి పవన్ భేటీ అయ్యారు. 35 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీలు కలిసి పని చేయడంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానితో కీలక సమావేశానికి పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు.

ప్రధానితో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీని కలిశానని పవన్ తెలిపారు. ఏపీలోని పరిస్థితులన్నీ ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారని పవన్ చెప్పారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తనకున్న అవగాహన మేరకు అన్ని విషయాలు చెప్పానన్నారు. ఏపీ ప్రజలు బాగుండాలి, ఏపీ ప్రజలు అభివృద్ధి చెందాలి, తెలుగు ప్రజల ఐక్యత వర్దిల్లాలి అని ప్రధాని మోదీ ఆకాంక్షించారని పవన్ కల్యాణ్ అన్నారు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన సమావేశం ఇది అని పవన్ వ్యాఖ్యానించారు. ప్రధానితో భేటీతో ఏపీకి మంచి జరగబోతోందని, భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

”ప్రధాని మోదీని 8ఏళ్ల తర్వాత కలిశా. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా.. ప్రధానిని కలవాలని పీఎంవో ఆఫీస్ నుంచి నాకు పిలుపొచ్చింది. అందుకే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిశా. ఇది ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన సమావేశం. ఈ సమావేశంలో ఏపీ పరిస్థితులపై ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలని, ఏపీ ప్రజలు ఆనందంగా ఉండాలని, ప్రజలు అభివృద్ధి చెందాలని, దానికోసం కృషి చేస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రధానితో నా మీటింగ్.. ఏపీలో మంచి రోజులు తీసుకొస్తుందని నేను ప్రగాడంగా నమ్ముతున్నా” అని పవన్ కల్యాణ్ అన్నారు.

కాగా విశాఖలో ఇటీవల జరిగిన పరిణామాలపై ప్రధానితో మాట్లాడారా? అన్న ప్రశ్నకు పవన్ సమాధానం దాటవేశారు. ఇవన్నీ త్వరలో తెలియజేస్తానని మీడియా సమావేశాన్ని ముగించుకుని వెళ్లిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత మోదీతో పవన్ సమావేశమయ్యారు. వాస్తవానికి ప్రధానిని మొదట బీజేపీ కోర్ కమిటీ సభ్యులు కలవాల్సి ఉంది. ఆ తర్వాతే పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే ప్రధాని పర్యటన గంటన్నర ఆలస్యం కావడంతో, మోదీని మొదట పవన్ కల్యాణ్ కలిశారు. ఈ కీలక సమావేశానికి పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు.

ఏపీకి మంచి జరగబోతోంది, రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయి అంటూ.. ప్రధానితో భేటీ తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి. పవన్ కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి. పవన్ ఏ ఉద్దేశ్యంతో ఆ కామెంట్స్ చేశారు? ఏపీకి జరగనున్న ఆ మంచి ఏంటి? అనేదాని ఆసక్తికరంగా మారింది.