మసాల అనుకుని చికెన్ కర్రీలో విష గుళికలు..ఇద్దరు చిన్నారులు మృతి 

  • Edited By: bheemraj , June 22, 2020 / 07:25 PM IST
మసాల అనుకుని చికెన్ కర్రీలో విష గుళికలు..ఇద్దరు చిన్నారులు మృతి 

చిత్తూరు జిల్లాలో విషాధం నెలకొంది. వృధ్యాప్యంలో ఉన్న అమ్మమ్మ చేసిన పొరపాటు ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. గరం మసాల అనుకుని చికెన్ కర్రీలో విష గుళికలు కలిపింది. విష గుళికలు కలిపిన ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన గుడిపాల మండలంలోని ఏఎల్‌పురం గ్రామంలో చోటు చేసుకుంది. మృతులు తవణంపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన రోహిత్‌ (11), జీవా (8 )గా గుర్తించారు.

వడ్డేపల్లికి చెందిన చిన్నారులు రోహిత్‌, జీవా అమ్మమ్మ ఊరైన ఏఎల్‌పురానికి వెళ్లారు. దీంతో వారి అమ్మమ్మ చికెన్ వండి… మనవళ్లకు పెడదామని నిర్ణయించుకుంది. అయితే చికెన్ వండేటప్పుడు కూరలో గరం మసాలా బదులు విష గుళికలు కలిపింది. విష గుళికలు వేసిన చికెన్ తినడంతో ఇద్దరు మనవళ్లు మృతి చెందారు.

అదే ఆహారం తిన్న చిన్నారుల అమ్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు వైద్యం అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.