PM Modi: కృష్ణ భారతి పాదాలకు నమస్కారం చేసిన ప్రధాని మోదీ.. ఆమె ఎవరంటే?

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పసల కృష్ణభారతికి మోదీ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

PM Modi: కృష్ణ భారతి పాదాలకు నమస్కారం చేసిన ప్రధాని మోదీ.. ఆమె ఎవరంటే?

Pm Modi (7)

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి – అంజలక్ష్మిల కుమార్తె పసల కృష్ణభారతికి మోదీ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

PM Modi Black Balloons : మోదీకి తప్పిన పెనుప్రమాదం.. ప్రధాని హెలికాప్టర్‌కు సమీపంలో బెలూన్ల కలకలం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకాలోని పశ్చిమ విప్పర్రు గ్రామంలో 26 జనవరి 1900లో సంపన్న కుటుంబంలో పసల కృష్ణమూర్తి జన్మించారు. 1904లో తణుకు తాలూకా కుముదవల్లిలో మునసబు కుటుంబంలో అంజలక్ష్మి జన్మించారు. 1916 సంవత్సరంలో వీరికి పెళ్లయింది. వీరు గాంధేవాదులు. 1921 సంవత్సరంలో గాంధీజీ విజయవాడ, ఏలూరు పర్యటనకు వచ్చిన సందర్భంలో గాంధీజీ సమక్షంలో ఇద్దరూ కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకొని స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. 25 ఏప్రిల్ 1929 సంవత్సరంలో ఆనంద నికేతన్‌కు వచ్చిన గాంధీజీని కలిసి ఖద్దరు నిధికి తమ ఒంటిపైనున్న ఆభరణాలన్నింటినీ ఇచ్చేశారు. వెంట వచ్చిన ఆరేళ్ల కుమార్తె సత్యవతి, నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణ కూడా తమ ఆభరణాలను సమర్పించారు. పిల్లలను తన ఒళ్లో కూర్చోబెట్టుకొని.. ఇప్పుడిచ్చారు సరే.. మళ్లీ బంగారంపై మోజు పడకుండా ఉంటారా అంటూ గాంధీ అడగడంతో ఇకపై నగలు ధరించబోమంటూ వారు ప్రతిన బూనారు. నాటినుంచి వారు బంగారం జోలికెళ్లలేదు.

క్లోజ్ ఫ్రెండ్స్‌లా మాట్లాడుకున్న మోదీ, చిరు

రెండో కుమార్తె కృష్ణభారతికి చెవులను కూడా కుట్టించలేదు. కృష్ణమూర్తి జీవితాంతం బాపూజీ వేషధారణలోనే సంచరించారు. అంజలక్ష్మి స్వయంగా వడికిన నూలుతో చేసిన ఖద్దరు వస్త్రాలనే ధరించారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఇద్దరు 1931లో జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో అలంజలక్ష్మి నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణను పట్టుకొనే జైలుకెళ్లారు. జైలు నుంచి తిరిగివచ్చారు. మరుసటి ఏడాది ఆంగ్లేయ ప్రభుత్వం మరోసారి ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అప్పుడు అంజలక్ష్మికి పది నెలలు కారాగార శిక్ష విధించారు. అప్పుడు ఆమె ఆరు నెలల గర్భిణీ. అక్టోబర్ 29న ఆమె జైలులోనే ఆడబిడ్డకు జన్మనించారు. కృష్ణుడిలా కారాగారంలో పుట్టినందుకు ‘కృష్ణ’, భారతావని దాస్య శృంఖలాలు తెంచే పోరాటంలో భాగమైనందుకు ‘భారతి’ కలిపి.. ఆ బిడ్డకు కృష్ణభారతి అని పేరుపెట్టారు. 1933 సంవత్సరంలో అంజలక్ష్మి జైల్లోంచి బయటకు వస్తుంటే ప్రజలు నీరాజనాలు పట్టారు.