Odisha Train Accident : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏపీ ప్రయాణికుల వివరాలు వెల్లడించిన రైల్వే శాఖ.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ఎపీకి రావాల్సిన ప్రయాణికులు 48 మంది ఉన్నారని..రైలు ఎక్కిన వారిలో 48 మందిలో 32 మంది పురుషలు, 16మంది మహిళలు ఉన్నారని తెలిపారు.

Odisha Train Accident : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏపీ ప్రయాణికుల వివరాలు వెల్లడించిన రైల్వే శాఖ.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Odisha Train Accident

Odisha Train Accident : ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎపీకి చెందిన వారి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో షాలినర్ లో 39మంది, సంత్రగచిలో 6 గురు, ఖరగ్ పూర్ లో ముగ్గురు రైలు ఎక్కినట్లు అధికారులు తెలిపారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఎపీకి రావాల్సిన ప్రయాణికులు 48 మంది ఉన్నారని..రైలు ఎక్కిన వారిలో 48 మందిలో 32 మంది పురుషులు, 16మంది మహిళలు ఉన్నారని తెలిపారు.

Odisha Train Accident: రైలు ప్రమాదంపై కొత్త ప్రశ్నలు.. కవచ్ ఉండి కూడా ప్రమాదం జరిగిందా? లేదంటే కవచమే లేదా?

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లో ఎక్కి విజయవాడ‌లో దిగాల్సిన వారు – 33 మంది ఉన్నారని.. ఏలూరులో దిగాల్సిన వారు ఇద్దరు ఉన్నారని.. అలాగే తాడేపల్లిగూడెంలో ఒకరు, రాజమహేంద్రవరంలో 12మంది దిగాల్సినవారు ఉన్నారని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. వారు గమ్యాన్ని చేరకుండానే వారు ప్రయాణించే కోరమాండ్ రైలు ప్రమాదానికి గురి అయ్యింది. ఎపీకి చెందిన ప్రయాణికులు ఫోన్ నెంబర్లు, ప్రయాణించిన కోచ్, బెర్తుల వివరాలు తెలిపింది రైల్వేశాఖ. ఏపీకి చెందినవారు ఎక్కడున్నారు? అనే వివరాలుతెలియాల్సి ఉంది.

CM Jagan : ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష .. ఘటనాస్థలానికి మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ఐఏఎస్‌ల బృందం

ఈ ప్రమాదానికి రైళ్లలో ప్రయాణిస్తున్న తమ వారు ప్రాణాలతో ఉన్నారో లేదోనని.. వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటనా స్థలానికి మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందం వెళ్లాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిస్థితుల రీత్యా అవసరమైతే ఘటనాస్థలానికి పంపించడానికి అంబులెన్స్‌లు సన్నద్ధం చేయాలని.. ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆస్పత్రులు అలర్ట్‌ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తిరుపతి, నెల్లూరు ప్రయాణికులు సురక్షితం
బెంగళూరు -హౌరా యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ లో తిరుపతి, నెల్లూరు జిల్లాలకు చెందిన 10 మంది ప్రయాణించారు. గూడూరుకు చెందిన నలుగురు, నెల్లూరుకు చెందిన ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. అయితే ప్రమాదం జరగక ముందే 8 మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకున్నట్టు నెల్లూరు రైల్వే సిబ్బంది తెలిపారు. మిగిలిన ఇద్దరు ప్రయాణికులు కూడా ప్రమాదం నుంచి బయటపడినట్టు వెల్లడించారు.