Ram Gopal Varma : మగాళ్లంతా పోయి, స్త్రీ జాతికి నేనే దిక్కు కావాలి, మరోసారి వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఏం మేసేజ్ ఇద్దామని

గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలన్న ఆర్జీవీ.. స్త్రీ జాతికి తానే దిక్కు కావాలన్నారు. ఆర్జీవీ వ్యాఖ్యలతో అక్కడున్న విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా షాక్ తిన్నారు.

Ram Gopal Varma : మగాళ్లంతా పోయి, స్త్రీ జాతికి నేనే దిక్కు కావాలి, మరోసారి వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఏం మేసేజ్ ఇద్దామని

Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ.. కాంట్రవర్సీకి కేరాఫ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వర్మ సినిమాలే కాదు.. మాటలు, చేష్టలు కూడా వివాదాస్పదంగానే ఉంటాయి. వర్మ ఏం చేసినా, ఏం మాట్లాడినా.. రచ్చ రచ్చ జరగాల్సిందే. కావాలనే తన మాటలతో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడో, లేక తెలియక చేస్తాడో ఆర్జీవీకే తెలియాలి. తాజాగా సంచలన, వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ.. మరోసారి తన మాటలతో మంట పెట్టారు. కాంట్రవర్సీకి కేరాఫ్ గా నిలిచారు.

గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన వర్మ.. విద్యార్థులకు అనుచిత సలహాలు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. నచ్చింది తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అన్న ఆర్జీవీ.. చనిపోయాక స్వర్గానికి వెళితే.. అక్కడ రంభ, ఊర్వశి ఉండకపోవచ్చన్నారు. అందుకే, ఏదైనా ఇక్కడే ఎంజాయ్ చేయాలన్నారు. అంతేకాదు.. వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలన్న ఆర్జీవీ.. స్త్రీ జాతికి తానే దిక్కు కావాలన్నారు. ఆర్జీవీ వ్యాఖ్యలతో అక్కడున్న విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా షాక్ తిన్నారు.

Also Read..RGV : అందుకే రణవీర్ న్యూడ్ ఫోటోషూట్ చేశాడు.. అదిరిపోయిన ఆర్జీవీ ట్వీట్..

నాగార్జున యూనివర్సిటీలో అకడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వర్మ హాజరయ్యారు. అక్కడ.. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ”చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే అక్కడ రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చు. అందువల్ల జీవితాన్ని ఇక్కడే ఎంజాయ్ చేయాండి. ఎవరికి నచ్చిన విధంగా వారు బతకండి. కష్టపడకుండా, ఉపాధ్యాయుల మాటలు వినకుండా ఇష్టానుసారం జీవించండి” అని సెలవిచ్చారు వర్మ.

”కష్టపడి చదివే వారు ఎప్పుడూ పైకి రారు. ఏదైనా స్ట్రేంజ్ వైరస్‌ వచ్చి నేను తప్ప మగ వాళ్లంతా పోవాలి. అప్పుడు స్త్రీ జాతికి నేనే దిక్కవుతా. తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి” అని విద్యార్థులకు సూచించారు వర్మ.

Also Read..RGV : అషు రెడ్డి పాదాలను ముద్దాడుతున్న RGV.. వైరల్ అవుతున్న వీడియో..

”జంతువులు చాలా హ్యాపియస్ట్ లైఫ్ ని గడుపుతాయి. ఎందుకంటే వాటికి ఆంక్షలు ఉండవు. అది దాని ఇష్టం వచ్చినట్లు బతుకుతుంది. ఎంజాయ్ చేస్తుంది. దానికి నచ్చింది తింటుంది, తిరుగుతుంది, శృంగారం చేస్తుంది. మనిషికి మాత్రం అనేక ఆంక్షలు ఉంటాయి. అది వద్దు, ఇది వద్దు. అది మంచిది కాదు, అది తప్పు, ఇది తప్పు అని ఆంక్షలు పెడతారు. అందుకే, నేను మాత్రం ఓ జంతువులా బతుకుతున్నా. ఎక్కడెక్కడ ఆనందం దొరుకుతుందో ఆ పనులన్నీ చేస్తున్నా. ఒకవేళ నేను చచ్చాక పైకి వెళితే అక్కడ రంభ, ఊర్వశి లేకపోతే.. అందుకే ఆ ఛాన్స్ నేను తీసుకోను. అన్నీ నేను ఇక్కడే అనుభవించేస్తాను” అని రాంగోపాల్ వర్మ అన్నారు.

రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. యూనివర్శిటీ విద్యార్థులకు చెప్పాల్సిన విషయాలు ఇవేనా? అని పలువురు మండిపడుతున్నారు. విద్యార్థులు, మహిళా ఉద్యోగులు సైతం వర్మ తీరుని తప్పుపడుతున్నారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావ్? అని తిట్టిపోస్తున్నారు. సభ్య సమాజానికి, విద్యార్థి లోకానికి నువ్విచ్చే మేసేజ్ ఇదేనా? అని నిప్పులు చెరుగుతున్నారు. వర్మ వ్యాఖ్యలతో విద్యార్థులు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని, చెడు మార్గంలో పయనించే ప్రమాదం ఉందని విద్య చెప్పే గురువులు, పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నువ్వస్సలు మనిషివేనా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు.. ఇలాంటి వ్యక్తిని దేవాలయం లాంటి యూనివర్సిటీకి పిలిచింది ఎవరు? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.