Red Sandalwood : రెండు ఇన్నోవాలతో సహా 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు జిల్లాలో రెండు ఇన్నోవాలలో అక్రమంగా తరలిస్తున్న 16 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Red Sandal Seized
Red Sandalwood : చిత్తూరు జిల్లాలో రెండు ఇన్నోవాలలో అక్రమంగా తరలిస్తున్న 16 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు జిల్లా పీలేరులో శుక్రవారం తెల్లవారు ఝూమున పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో రెండు ఇన్నోవాలలో తరలిస్తున్న ఎ్రరచందనం దుంగలను గుర్తించారు. వాటిని తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో చంద్రగిరి నియోజకవర్గం, చిన్నగొట్టిగల్లుకు చెందిన మహేశ్వర్ రెడ్డి, అతని అనుచరులు మునీశ్వర్, కృష్ణయ్య ఉన్నట్లు సమాచారం.