Trains Restoration : ప్యాసింజర్ రైళ్లు పునరుధ్ధరణ

ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో నిలిపివేసిన దాదాపు పన్నెండు ప్యాసింజర్ రైళ్ల సేవలను ధశల

Trains Restoration : ప్యాసింజర్ రైళ్లు పునరుధ్ధరణ

Scrailway Trains

Updated On : November 9, 2021 / 7:24 PM IST

Trains Restoration :  ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో నిలిపివేసిన దాదాపు పన్నెండు ప్యాసింజర్ రైళ్ల సేవలను ధశల వారీగా తిరిగి పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అంతే కాకుండా ఇకపై ఇవి అన్ రిజర్వుడ్ ఎక్స్ప్రెస్ లుగా నడుస్తాయని స్పష్టం చేసింది. దీనితో పాటు ప్రయాణికులపై భారం కూడా మోపింది. ఈ 12 రైళ్ల హాల్టింగ్ స్టేషన్ల సంఖ్య కూడా తగ్గుతుందని స్పష్టం చేసింది.

ఎక్స్‌ప్రెస్ రైళ్లు గా మారిన ప్యాసింజర్ రైళ్ళు ఇవే..

తెనాలి-రేపల్లె-తెనాలి (07873/07874),
రేపల్లె-తెనాలి-రేపల్లె (07875/07876). ఇది ఈ నెల 13 నుంచి అందుబాటులోకి వస్తుంది.

మిర్యాలగూడ-నడికుడి-మిర్యాలగూడ (07277/07273). ఈ మెమూ రైలు ఈ నెల 11 నుంచి అందుబాటులోకి వస్తుంది.
నర్సాపూర్-విజయవాడ-నర్సాపూర్ (07044/07045). ఈ డెమూ రైలు 14 నుంచి పట్టాలపైకి వస్తుంది.

కాచిగూడ-రొటెగాం-కాచిగూడ (07571/07572) ఈ నెల 15 నుంచి అందుబాటులోకి వస్తుంది.
కాచిగూడ-మిర్యాలగూడ-కాచిగూడ (07276/07974). ఇది ఈ నెల 11 నుంచి సేవలు ప్రారంభిస్తుంది.