SaiPriya Missing Mystery : మిస్ అయిందా? కావాలనే మిస్ చేశారా? సాయిప్రియ కేసులో అన్నీ అనుమానాలే

వైజాగ్ ఆర్కే బీచ్ లో సోమవారం సాయంత్రం అసలేం జరిగింది? సాయిప్రియ ఎలా మిస్ అయ్యింది? సాయి ప్రియ మిస్సింగ్ మిస్టరీ పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసులో అంతా క్లియర్ గా ఉన్నట్టు అనిపిస్తున్నా అనుమానాలు ఎన్నో.(SaiPriya Missing Mystery)

SaiPriya Missing Mystery : మిస్ అయిందా? కావాలనే మిస్ చేశారా? సాయిప్రియ కేసులో అన్నీ అనుమానాలే

Saipriya Missing Mystery

SaiPriya Missing Mystery : వైజాగ్ ఆర్కే బీచ్ లో సోమవారం సాయంత్రం అసలేం జరిగింది? సాయిప్రియ ఎలా మిస్ అయ్యింది? సాయి ప్రియ మిస్సింగ్ మిస్టరీ పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసులో అంతా క్లియర్ గా ఉన్నట్టు అనిపిస్తున్నా అనుమానాలు ఎన్నో.

Visakhapatnam : పెళ్లిరోజు భర్తతో కలిసి ఆర్కే బీచ్ కు వెళ్లిన వివాహిత గల్లంతు..కొనసాగుతున్న గాలింపు చర్యలు

సాయిప్రియ, శ్రీనివాస్ దంపతులు. వారి పెళ్లి జరిగి నిన్నటికి(జులై 25) సరిగ్గా ఏడాది. పెళ్లి రోజు కావడంతో నిన్న ఉదయం 11 గంటలకు దంపతులు ఇంటి నుంచి బయలుదేరారు. 12 గంటలకు సింహాచలం గుడికి వెళ్లొచ్చారు సాయిప్రియ, శ్రీనివాస్. మధ్యాహ్నం ఒకటిన్నరకు ఇంటికి చేరుకున్నారు. మళ్లీ సాయంత్రం మూడున్నర గంటలకు ఇంటి నుంచి బయలుదేరి నాలుగన్నర గంటలకు బీచ్ కు చేరుకున్నారు. 5గంటల 15 నిమిషాల వరకు బీచ్ మెట్లపై కూర్చుని సెల్ఫీలు దిగారు. 5 గంటల 20 నిమిషాలకు బీచ్ లో కి వెళ్లారు. గంటకు పైగా ఇద్దరూ నీటిలో ఇద్దరూ ఆడుకున్నారు. 6.30 గంటలకు తన వస్తువులను భర్తకు ఇచ్చిన సాయిప్రియ ఇంకొంత లోపలికి వెళ్లింది. 6గంటల 50 నిమిషాలకు ఓ మేసేజ్ రావడంతో అది చూసి వెనక్కి తిరిగి చూసేలోపే సాయిప్రియ మాయమైందని భర్త శ్రీనివాస్ చెబుతున్నాడు. చీకటి పడటం, చుట్టూ ఎవరూ చూడకపోవడంతో సాయిప్రియ మిస్సింగ్ మిస్టరీగా మారింది.(SaiPriya Missing Mystery)

Madhurawada Murali Missing Case : ఆమెకు 35.. వాడికి 18.. మధురవాడ మురళి మిస్సింగ్ కేసులో షాకింగ్ నిజాలు

సముద్రం అన్నాక అలలు కామన్. కానీ, అడుగు లోతు నీటిలో ఉన్నప్పుడు అలలు వచ్చినా మనిషి కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంత బలమైన అల వచ్చినా అక్కడే కిందపడి వెంటనే లేవొచ్చు. కానీ, ఆ అల వెంటనే మనిషిని వెనక్కి లాక్కెళ్లే చాన్స్ చాలా తక్కువ. మరి, సాయిప్రియ విషయంలో ఏం జరిగింది? అలలే ఆమెను సముద్రంలోకి లాక్కెళ్లాయా? లేక సాయిప్రియ అక్కడి నుంచి మాయమైందా? ఇప్పుడీ వ్యవహారం సస్పెన్స్ గా మారింది.

Sai Priya Missing Mystery : వైజాగ్ బీచ్‌లో మిస్సింగ్ మిస్టరీ.. అసలేం జరిగింది? సాయిప్రియ ఎక్కడ?

అటు సాయిప్రియ గల్లంతైన ప్రదేశాన్ని పరిశీలించారు జీవీఎంసీ మేయర్ వెంకటకుమారి. సాయిప్రియ గల్లంతు ఘటన దురదృష్టకరం అన్నారు. సముద్రంలో స్నానాలు చేయడం ప్రమాదకరం అని హెచ్చరిక బోర్డులు పెడుతున్నామని మేయర్ చెప్పారు. గత ఈతగాళ్లు, కోస్ట్ గార్డ్స్, పోలీసుల సాయంతో గాలింపు చర్యలను తీవ్రం చేశామని మేయర్ తెలిపారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సాయిప్రియ మిస్సింగ్ వ్యవహారంలో అన్నీ అనుమానాలే. అడుగు నీటిలో నిలబడ్డప్పుడు అలల తాకిడి తక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సాయి ప్రియ మిస్ అయిన సమయంలో చీకటి పడటం, ఎవరూ చూడకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. అప్పటివరకు నీటిలోనే ఉన్న సాయిప్రియ తన వస్తువులన్నీ భర్తకు ఎందుకిస్తుంది? సాయిప్రియ ఇంకా లోతుకు వెళ్తుంటే భర్త శ్రీనివాస్ ఎందుకు ఆపలేదు? ఫోన్ చూసి తిరిగే లోపు సాయిప్రియ మాయమయ్యేందుకు ఇదేమైనా సినిమానా? సాయిప్రియ మిస్సింగ్ మిస్టరీలో ఇలా ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. కాగా, సాయిప్రియను సముద్రం లాక్కెళ్లే చాన్సే లేదని గజఈతగాళ్లు అంటున్నారు. దీంతో సాయప్రియ మిస్సింగ్ వ్యవహారంలో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.