ప్రకాశం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్, గుడికి వెళ్లి వస్తుండగా, రంగంలోకి ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్, గుడికి వెళ్లి వస్తుండగా, రంగంలోకి ఎమ్మెల్యే

sarpanch candidate kidnapped: ఏపీలో పంచాయతీ ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో లోకల్ వార్ రసవత్తరంగా మారింది.

ఇదిలా ఉంటే, ప్రకాశం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేపింది. చిన్నగంజాం మండలం పెద్దగంజాంలో సర్పంచ్‌ అభ్యర్థిని కిడ్నాప్‌ చేశారు. కారులో గుడికి వెళ్లి వస్తున్న సమయంలో టీడీపీ మద్దతు సర్పంచ్‌ అభ్యర్థి తిరుపతిరావుని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తిరుపతిరావుని దుండగులు ఒంగోలు వైపు తీసుకెళ్లారని మద్దతుదారులు తెలిపారు.

సమాచారం తెలుసుకున్న పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు వెంటనే పోలీసులతో మాట్లాడారు. విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తిరుపతిరావు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.