Secunderabad Violence : సికింద్రాబాద్ విధ్వంసం.. తెలంగాణ పోలీసులకు సుబ్బారావు అప్పగింత?
నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో సాయి డిఫెన్స్ అకాడెమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావుని విచారిస్తున్న పోలీసులు.. విచారణ అనంతరం సుబ్బారావుని తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది.

Secunderabad Violence : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో సాయి డిఫెన్స్ అకాడెమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావుని విచారిస్తున్న పోలీసులు.. విచారణ అనంతరం సుబ్బారావుని తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది.
మరోవైపు సుబ్బారావు డిఫెన్స్ అకాడెమీలో పోలీసులు సోదాలు జరిపారు. నరసరావుపేట డిఫెన్స్ అకాడెమీ నుంచి, ఖమ్మం డిఫెన్స్ అకాడెమీ నుంచి సికింద్రాబాద్ కు ఎంతమంది వెళ్లారనే విషయం పై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. కాసేపట్లో తెలంగాణ పోలీసులు నరసరావుపేటకు చేరుకునే అవకాశం ఉంది. ఏపీ పోలీసులు ఆవుల సుబ్బారావుని తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.(Secunderabad Violence)
Sai Defence Academy : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం.. పోలీసుల అదుపులో దాడుల సూత్రధారి?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక భారీ కుట్ర కోణాన్ని వెలికితీసిన పోలీసులు హింసాత్మక ఘటనలకు కారణమైన వారిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. సాయి డిఫెన్స్ అకాడెమీ డైరెక్టర్ సుబ్బారావుని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు నరసరావుపేట పోలీసులు. ప్రకాశం జిల్లా కంభంలో సుబ్బారావుని అదుపులోకి తీసుకుని నరసరావుపేట టుటౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి సుబ్బారావుని భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.
Agnipath: ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో పాల్గొన్న వారికి పోలీసు క్లియరెన్స్ రాదు: ఎయిర్ చీఫ్ మార్షల్
15ఏళ్ల క్రితం ఖమ్మం నుంచి నరసరావుపేటకు వలస వెళ్లారు సుబ్బారావు. ఖమ్మంలో ఆర్మీ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తారు. కానీ, ఆయన నరసరావుపేటలో నివాసం ఉంటున్నారు. ఖమ్మం, నరసరావుపేటతో పాటు హైదరాబాద్ లోనూ సాయి డిఫెన్స్ అకాడెమీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ ఆర్మీ ర్యాలీ జరిగినా తన స్టూడెంట్స్ ను తీసుకెళ్లేవారు సుబ్బారావు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన విధ్వంసం వెనుక వాట్సాప్ మేసేజ్ లు, గ్రూప్ చాటింగ్ లను గుర్తించారు పోలీసులు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై దర్యాఫ్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఆందోళనల్లో పాల్గొన్న మొత్తం 122 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసుల అదుపులో 100 మంది నిరసనకారులు, రైల్వే పోలీసుల అదుపులో 22 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అటు అల్లర్లకు కుట్ర రచించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడెమీ డైరెక్టర్ సుబ్బారావుని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. విధ్వంసకర దాడులకు పాల్పడ్డ వారిలో సాయి డిఫెన్స్ అకాడెమీ అభ్యర్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అల్లర్లకు ప్లాన్ చేసినట్లు తేల్చారు పోలీసులు.
ఇక కుట్రకు సూత్రధారులను గుర్తించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. వాట్సాప్ గ్రూప్ లో అభ్యర్థులను రెచ్చగొట్టిన వారిని పోలీసులు గుర్తించారు. వాట్సాప్ గ్రూప్స్, అలాగే సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గుర్తింపు కొనసాగుతోంది. అటు నిరసనకారులపై 14 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు రైల్వే పోలీసులు. అల్లర్లకు ముందు రోజు గుంటూరు నుంచి హైదరాబాద్ కు 450 మంది సాయి డిఫెన్స్ అకాడెమీ అభ్యర్థులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
- Secunderabad Protests: సుబ్బారావు రిమాండ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుందంటే..
- Subba Rao Arrest : ఎంత పని చేశావ్ సుబ్బారావ్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్..?
- Secunderabad Riots : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. మరో 10మంది అరెస్ట్, తమ పిల్లలు అమాయకులంటున్న తల్లిదండ్రులు
- Secunderabad Violence Pruthvi : నా కుమారుడు బోగీలకు నిప్పు పెడతాడని ఊహించలేదు- పృథ్వీ తల్లిదండ్రులు
- Subba Rao : సుబ్బారావుకి రూ.50కోట్ల నష్టం..! అందుకే ఈ దుర్మార్గం.. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో షాకింగ్ విషయాలు
1Congress MP: “పెన్ను పోయింది కనిపెట్టండి” కాంగ్రెస్ ఎంపీ కంప్లైంట్
2Bollywood : 27 ఏళ్ళ తర్వాత షారుఖ్, సల్మాన్ కాంబో..
3Pooja Hegde : తమిళ్ వాళ్ళకి కూడా పూజాహెగ్డేనే కావాలంట..
4Maharashtra: మెర్సిడెస్ కారును ఆటో రిక్షా వెనకేసింది: ఉద్ధవ్‌కు సీఎం ఏక్నాథ్ షిండే కౌంటర్
5Tollywood : అప్పుడే దసరాకి మొదలైన ఫైట్.. స్టార్లంతా సిద్ధం..
6Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలుపుతూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
7Enforcement Directorate: హైదరాబాద్ సహా దేశంలోని 44 ప్రాంతాల్లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలపై ఈడీ దాడులు
8Tamannaah : తమన్నా ఇష్టాయిష్టాలు.. తమన్నా కష్టాలు.. ఫ్యాన్స్‌తో స్పెషల్ చిట్ చాట్..
9LPG cylinder: మళ్ళీ పెరిగిన వంట గ్యాస్ ధరలు
10Telangana: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?