Capital Amaravati: ‘రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతివ్వాలి’

అమరావతి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తిరుపతిలో నిర్వహించాలనుకుంటున్న రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరింది. సభకు ఉద్దేశపూర్వకంగానే

Capital Amaravati: ‘రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతివ్వాలి’

Amaravathi Farmers

Updated On : December 13, 2021 / 12:56 PM IST

Capital Amaravati: అమరావతి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తిరుపతిలో నిర్వహించాలనుకుంటున్న రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరింది. సభకు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం అడ్డుపడుతోందని పిటిషన్‌లో రైతుల తరఫు న్యాయవాది లక్ష్మినారాయణ హైకోర్టుకు వెల్లడించారు.

తిరుపతిలో రాజధాని రైతుల సభకు అనుమతివ్వకుండా పోలీసులు అసంబద్ధ కారణాలు చూపుతున్నారన్నారని అన్నారు. డీజీపీ.. మహా పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారని కోర్టుకు తెలిపారు. సభకు అనుమతి ఇవ్వాలా?…వద్దా? అనేది నిర్ణయించాల్సింది జిల్లా ఎస్పీ అని, అలాంటిది సభపై ఓ డీఎస్పీ అధికారి నిర్ణయం ఎలా తీసుకుంటారని రిట్ పిటిషన్‌లో ప్రశ్నించారు న్యాయవాది లక్ష్మినారాయణ.

అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు (మంగళవారం) విచారణ జరపనున్నారు.

…………………………… : బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్‌ ఐటీ ఆఫీసర్ పోస్టుల భర్తీ