Bank Of Baroda : బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్‌ ఐటీ ఆఫీసర్ పోస్టుల భర్తీ

పరీక్ష విధానం విషయానికి వస్తే పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. నాలుగు సెక్షన్ల నుంచి మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి.

Bank Of Baroda : బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్‌ ఐటీ ఆఫీసర్ పోస్టుల భర్తీ

Bank Of Baroda

Bank Of Baroda : ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా… ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ ఐటీ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల వివరాలకు సంబంధించి క్వాలిటీ అస్యూరెన్స్‌ లీడ్‌ 2 ఖాళీలు, క్వాలిటీ అస్యూరెన్స్‌ ఇంజనీర్లు12 ఖాళీలు, డెవలపర్‌(ఫుల్‌ స్టాక్‌ జావా, మొబైల్‌ అప్లికేషన్‌ డెవల్‌పమెంట్‌)24 ఖాళీలు, యూఐ/యూఎక్స్‌ డిజైనర్‌2 ఖాళీలు, క్లౌడ్‌ ఇంజనీర్‌2 ఖాళీలు, అప్లికేషన్‌ ఆర్కిటెక్ట్‌ 2ఖాళీలు, ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్ట్‌ 2ఖాళీలు, టెక్నాలజీ ఆర్కిటెక్ట్‌2 ఖాళీలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆర్కిటెక్ట్‌2 ఖాళీలు, ఇంటిగ్రేషన్‌ ఎక్స్‌పర్ట్ 2ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు అయా పోస్టుల్ని అనుసరించి 23 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక నిర్వహిస్తారు.

పరీక్ష విధానం విషయానికి వస్తే పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. నాలుగు సెక్షన్ల నుంచి మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్‌ కు సంబంధించి 25 ప్రశ్నలు 25 మార్కులు, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ కు సంబంధించి 25 ప్రశ్నలు 25 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ కు సంబంధించి 25 ప్రశ్నలు25 మార్కులు, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్ కు సంబంధించి 75 ప్రశ్నలు 150 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు. ప్రశ్న పత్రం ఇంగ్లీష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది.

అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ డిసెంబరు 28గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www. bankofbaroda.in/సందర్శించగలరు.