Tirupati : రూ. 300 కోట్ల విరాళం : ఎన్నో ట్విస్టులు, 10tv పరిశోధనలో సంచలన విషయాలు

టీటీడీకి 300 కోట్ల రూపాయల విరాళం వెనుక ఎన్నో ట్విస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై 10టీవీ చేసిన పరిశోధనలో మరెన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

Tirupati : రూ. 300 కోట్ల విరాళం : ఎన్నో ట్విస్టులు, 10tv పరిశోధనలో సంచలన విషయాలు

Tirumla Devastanam

Udveg 300 Crore : టీటీడీకి 300 కోట్ల రూపాయల విరాళం వెనుక ఎన్నో ట్విస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై 10టీవీ చేసిన పరిశోధనలో మరెన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. టీటీడీతో MOU కుదుర్చుకున్న ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌ డైరెక్టర్ల బోర్డులో ఇటీవలే మార్పులు జరిగాయి. మార్చి 4న అడిషనల్ డైరెక్టర్లుగా నలుగురు వ్యక్తులు చేరారు. యుగంధర్‌ సంపత్ కుమార్‌ శాఖమూరి, శివచంద్రయాదవ్‌, హస్తిముల్‌ చోర్డియా, గులాంనబీ మన్సూరి అడిషనల్ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు.

వీరిలో యుగంధర్‌ సంపత్ కుమార్‌ శాఖమూరి తెలుగు వ్యక్తి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రుచి కార్పొరేట్‌ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఎండీగా యుగంధర్ సంపత్ కుమార్ వ్యవహరిస్తున్నారు. మార్చి 2న ఫుడ్‌ స్క్రైబ్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ అనే మరో కంపెనీలోనూ ఆయన అడిషనల్‌ డైరెక్టర్‌గా చేరారు. నామిరేట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌, ఫైటోకెమ్‌ ఇండియా లిమిటెడ్‌లోనూ యుగంధర్‌ సంపత్‌ కుమార్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇందులో నామిరేట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

హోల్‌సేల్ అగ్రికల్చర్ రా మెటీరియల్‌, లైవ్ యానిమల్స్ , ఫుడ్ బెవరేజెస్, టోబాకో వ్యాపారాలను నిర్వహిస్తోంది. అయితే.. ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కేదార్ నాథ్‌ సింగ్‌కూ.. యుగంధర్‌కు ఏమైనా డీల్ కుదిరిందా..? పెద్దగా పనులేవీ చేయని ఉద్వేగ్ ఇన్‌ఫ్రాలో యుగంధర్‌ అడిషనల్ డైరెక్టర్‌గా ఎందుకు చేరారు? ఉద్వేగ్ ఇన్‌ఫ్రాలో యుగంధర్ చేరిన వారం రోజులకే టీటీడీతో MOU చేసుకోవడం వెనుక మతలబు ఏంటి? సంజయ్‌ కేదార్‌నాథ్‌ సింగ్‌ను తిరుమలకు తీసుకొచ్చింది కూడా యుగంధరేనా..? టీటీడీతో రూ. 300 కోట్ల MOU కాకతాళీయంగా జరిగిందా? ఈ ప్రశ్నలకే ఇప్పుడు సమాధానం దొరకాల్సి ఉంది. ఈ సమాధానాలే.. టీటీడీతో 300 కోట్ల రూపాయల MOU చిక్కుముడిని విప్పే అవకాశం ఉంది.
https://www.youtube.com/watch?v=UAnDZK2ZkXg