Srisailam Dam : శ్రీశైలం డ్యాంపై ప్రమాదం.. భయాందోళనలో సిబ్బంది, స్థానికులు

Srisailam Dam : మంటలు చెలరేగడం, పొగ కమ్మేయడంతో కాసేపు వరకు అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో డ్యామ్ కి ఏమైనా అవుతుందేమో? అని సిబ్బంది, స్థానికులు భయాందోళన చెందారు.

Srisailam Dam : శ్రీశైలం డ్యాంపై ప్రమాదం.. భయాందోళనలో సిబ్బంది, స్థానికులు

Srisailam Dam

Srisailam Dam : నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ పై షార్ట్ సర్క్యూట్ జరిగింది. డ్యామ్ చేంజ్ ఓవర్ స్విచ్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంతో డ్యామ్ ప్రొడక్షన్ ఫోర్స్ భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలియజేశారు. వెంటనే శ్రీశైలం డ్యామ్ కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు డ్యాం అధికారులు.

శ్రీశైలం డ్యామ్ పై విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కలకలం రేపింది. ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపించింది. డ్యామ్ ప్రొడక్షన్ ఫోర్స్ సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. 12వ గేటుపైన ఉన్నటువంటి డ్యామ్ చేంజ్ ఓవర్ స్విచ్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే డ్యామ్ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే డ్యామ్ కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత రిపేర్ చేశారు. మంటలు, పొగ రావడంతో కాసేపు అంతా కంగారుపడ్డారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనకు గురయ్యారు.

Also Read..Rajinikanth : YCP నాయకులపై ఫైర్ అవుతున్న తలైవా ఫ్యాన్స్.. ట్రెండింగ్ లో #YSRCPApologizeRajini

మంటలు చెలరేగడం, పొగ కమ్మేయడంతో కాసేపు వరకు అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో డ్యామ్ కి ఏమైనా అవుతుందేమో? అని సిబ్బంది, స్థానికులు భయాందోళన చెందారు. అయితే, అలాంటిదేమీ జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బంది ఆదేశించారు.

Also Read..AP Politics: సైలెంట్ అయ్యారు..! చంద్రబాబు, పవన్ భేటీ.. ఏపీ బీజేపీలో మారుతున్న సమీకరణాలు..