Should be Chandrababu arrested ? : చంద్రబాబుకు అరెస్టు తప్పదా? సీఐడీ విచారణకు హాజరవుతారా? ఆయనకున్న ఆప్షన్స్ ఏంటీ?

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ తప్పదా? ఇందుకు సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులో వివరాలే.. ఈ అరెస్ట్ వ్యవహారంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

Should be Chandrababu arrested ? : చంద్రబాబుకు అరెస్టు తప్పదా? సీఐడీ విచారణకు హాజరవుతారా? ఆయనకున్న ఆప్షన్స్ ఏంటీ?

Should Be Chandrababu Arrested In Amravati Land Case

Should be Chandrababu arrested ? : అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ తప్పదా? ఇందుకు సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులో వివరాలే.. ఈ Suspicions on the arrest affair రేకెత్తిస్తున్నాయి. దీంతో చంద్రబాబుకు సీఐడీ నోటీసుల జారీపై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ చంద్రబాబు సీఐడీ విచారణకు హాజరవుతారా? లేదా? ఇంకెలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? అసలు చంద్రబాబు ముందున్న ఆప్షన్లు ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే న్యాయ నిపుణులు ప్రకారం ప్రస్తుతానికి చంద్రబాబు ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఆప్షన్ వన్‌- నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులకు సహకరించి, విచారణకు హాజరవడం. రాజ్యాంగబద్దమైన పదవిలో కొనసాగిన చంద్రబాబు దర్యాప్తు సంస్థలకు సహకరించాలని న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. ఇక రెండోది తాను ఏ నేరం చేయలేదని సీఐడీ నోటీసులపై చంద్రబాబు కోర్టుకు వెళ్లడం.. దీనిపై క్వాష్ పిటిషన్‌ దాఖలు చేయడం. చంద్రబాబు ముందున్న మూడో ఆప్షన్… ముందస్తు బెయిల్‌లో దరఖాస్తు చేసుకోవడం. సీఐడీ నోటీసుల నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ మూడే చంద్రబాబు ముందున్న ఆప్షన్లని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో అనేక కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారు.

మరోవైపు ఏపీ సీఐడీ నోటీసుల జారీ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే చంద్రబాబు న్యాయనిపుణులతో భేటీ అయ్యారు. ఈనెల 23న సీఐడీ విచారణకు హాజరుకావాల్సిన అంశంపై సలహాలు తీసుకున్నారు. నోటీసులపై కోర్టుకి వెళ్లే అవకాశాన్ని పరిశీలించారు. దీంతో పాటు గతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా న్యాయనిపుణులతో చంద్రబాబు చర్చించారు. విచారణకు హాజరుకావాలా? వద్దా? అనేదానిపై చంద్రబాబు న్యాయ సలహాలు తీసుకున్నారు.

అంతకుముందు అమరావతిలో భూముల వ్యవహారంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న సీఐడీ… ఆయనపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 217, 123 B రెడ్‌ విత్‌ 34, 35, 36, 37 తో పాటు, SC, ST ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీ యాక్ట్, ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977 కింద కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత విచారణ జరపడం కోసం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సీఆర్‌పీసీ సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.