Snake Funerals : పాముకు అంత్యక్రియలు నిర్వహించిన దుర్గగుడి అర్చకులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై సంచరించే పాము నిన్న సాయంత్రం చనిపోయి కనపడింది. దానికి అర్చకులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.

Snake Funerals : పాముకు అంత్యక్రియలు నిర్వహించిన దుర్గగుడి అర్చకులు

Vijayawad Snake Funerals

Snake Funerals : హిందువులు పామును దేవతా స్వరూపంగా కొలుస్తారు. నాగుల చవితి వచ్చిందంటే చాలు పుట్టలో పాలుపోసి పూజలు చేస్తారు. జ్యోతిష్యంలో కూడా సర్పానికి ప్రత్యేకత ఉంది. రాహుకేతువులు సర్పానికి తల, తోక గా వ్యవహరిస్తుంటారు. అలాగే జాతకంలో సర్ప శాపాలు ఉన్నాయా…… ఉంటే జంట నాగులు ప్రతిష్టంచండి అని జ్యోతిష్యులు రెమిడీలు కూడా చెపుతుంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే విజయవాడ ఇంద్రకీలాద్రిపై సంచరించే పాము నిన్న సాయంత్రం చనిపోయి కనపడింది. దానికి అర్చకులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.

ఇంద్రకీలాద్రిపై రెండు పాములు తరచూ అక్కడి పూజారులకు కనపడుతూ ఉండేవి. అవి రెండు ఎవరికీ హానీ తలపెట్టకుండా వాటి దారిని అవి వెళ్లిపోతూ ఉండేవి. వాటిని కొండమీది అర్చకులు, దేవస్ధానం సిబ్బంది పవిత్రమైన దేవతా సర్పాలుగా భావించారు. ఒకసారి అమ్మవారి అంతరాలయంలోకి కూడా పాము వచ్చి ఆదృశ్యమయ్యింది.

Also Read : Vikarabad : వికారాబాద్ జిల్లాలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద మృతి

వాటిలో ఒక పాము నిన్న సాయంత్రం చనిపోయి ఘాట్ రోడ్డులోని ఓం టర్నింగ్  వద్ద కనిపించింది. సమాచారం తెలుసుకున్న అర్చకులు ఈరోజు ఉదయం ఆ పాముకు కృష్ణానది ఒడ్డున ఉన్న దుర్గాఘాట్ లో, దుర్గగుడి వైదిక కమిటీల సభ్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఆవు పిడకలు పేర్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో సర్పాలు చనిపోతే మనుషుల మాదిరిగానే వాటికి కార్యక్రమాలు చేయాలని దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు వివరించారు.