Special Vaccination : తెలుగు స్టేట్స్ లో వ్యాక్సినేషన్..విదేశాలకు వెళ్లే వారికి టీకాలు

కాస్త లేటైనా.. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్‌ను పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రస్తుతానికి 45 ఏళ్లు నిండిన వారికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వాలని భావిస్తున్నాయి ఉభయ రాష్ట్రాలు.

Special Vaccination : తెలుగు స్టేట్స్ లో వ్యాక్సినేషన్..విదేశాలకు వెళ్లే వారికి టీకాలు

Special Vaccination For Students Going Abroad

Students Going Abroad : కాస్త లేటైనా.. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్‌ను పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రస్తుతానికి 45 ఏళ్లు నిండిన వారికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వాలని భావిస్తున్నాయి ఉభయ రాష్ట్రాలు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేయనుంది తెలంగాణ సర్కార్‌. వారి కోసం ప్రత్యేక కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నారాయణగూడ ఐపీఎంలో టీకాల పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. స్లాట్ల కోసం 2021, జూన్ 04వ తేదీ శుక్రవారం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు టీకా కోసం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో స్లాట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని.. ఈ నెల 5 నుంచి స్లాట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది కేబినెట్‌. టీకా ఇస్తేనే విదేశాలకు వెళ్లే విద్యార్థులు సురక్షితంగా ప్రయాణం చేసే వీలుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను సైతం ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది.

విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్‌, ఉద్యోగులకు వయస్సుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 45 ఏళ్లలోపు ఉన్నా వారికి టీకా ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను మార్గదర్శకాలు జారీచేసినట్లు తెలుస్తోంది. విదేశాలకు వెళ్లేవారు ఆధార్‌ కార్డుకు బదులు పాస్‌పోర్టు నెంబర్‌ను కొవిన్ అప్లికేషన్‌లో పొందుపరుచుకోవాలని సూచించింది సర్కార్‌.

Read More : SBI Report: కరోనా సెకండ్ వేవ్ తగ్గినట్లే.. థర్డ్ వేవ్ ప్రభావం ఎన్నిరోజులంటే?