Online Classes On Tree : ఆన్‌లైన్ క్లాసుల కష్టాలు.. చెట్టెక్కిన విద్యార్థి

కరోనాతో కష్టాలు విద్యార్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి. విద్యాలయాలు మూతపడటంతో ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నాయి పలు విద్యా సంస్ధలు.

Online Classes On Tree : ఆన్‌లైన్ క్లాసుల కష్టాలు.. చెట్టెక్కిన విద్యార్థి

Online Classes On Tree

Online Classes On Tree : కరోనాతో కష్టాలు విద్యార్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి. విద్యాలయాలు మూతపడటంతో ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నాయి పలు విద్యా సంస్ధలు. ఆన్ లైన్ పాఠాలు వినేందుకు సెల్ ఫోన్, 4జీ నెట్ వర్క్, ఇంటర్నెట్ తప్పనిసరి. ఈ నేపధ్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్ధులు ఆన్ లైన్ పాఠాలు వినేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగా లేక కష్టాలు పడుతున్నారు. గ్రామాల్లో ఎత్తైన ప్రదేశాల్లో సిగ్నల్స్ అందుబాటులో ఉంటున్నాయి. దీంతో విద్యార్థులు ఎత్తైన భవనాలపైకి ఎక్కాల్సి వస్తుంది.

ఆ ఊరిలో ఎత్తైన భవనాలు ఏవీ లేకపోవడంతో.. ఓ విద్యార్థి ఏకంగా చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి ఆన్ లైన్ క్లాసులు వింటున్నాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కోసం ఇలా చెట్టు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చింతర్లపల్లికి చెందిన తిప్పేస్వామి అనంతపురం ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. గ్రామంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగా రాకపోవటంతో ఆన్ లైన్ పాఠాలు వినేందుకు ఇలా రోజూ చెట్టెక్కి కూర్చుని పాఠాలు వింటున్నాడు. రోజూ చెట్టెక్కి ఆన్ లైన్ పాఠాలు వింటున్న విద్యార్థిని ఊరి జనం వింతగా చూస్తున్నారు. చెట్టంత కష్టం అంటే ఇదేనేమో అని జాలి చూపుతున్నారు.