India : యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి.. ఏపీ, తెలంగాణ భవన్ కు చేరుకున్న తెలుగు విద్యార్థులు

పశ్చిమ ఉక్రెయిన్ నుంచి 28 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకుంది. తెలుగువారిలో 11 ఏపీ, 17 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు.

India : యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి.. ఏపీ, తెలంగాణ భవన్ కు చేరుకున్న తెలుగు విద్యార్థులు

Indians

Students arriving in India : భారత్ ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను రొమేనియా, హంగేరి, పోలాండ్ దేశాల మీదుగా కేంద్ర ప్రభుత్వం భారత్ కు తరలిస్తోంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులు, పౌరులను ఎయిర్ ఇండియా విమానాల్లో తరలిస్తోన్నారు. నిన్నటి నుంచి భారత్ 469 మంది భారతీయులు చేరుకున్నారు. మరికాసేపట్లో రెండో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ రానుంది. 240 మందితో హంగేరి రాజధాని బుడాపెస్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది.

నిన్న రాత్రి 219 మంది విద్యార్థులతో తొలి ఎయిర్ ఇండియా విమానం ముంబై చేరుకుంది. తెల్లవారు జామున 250 మందితో రెండో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకుంది. పశ్చిమ ఉక్రెయిన్ నుంచి 28 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకుంది. తెలుగువారిలో 11 ఏపీ, 17 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏపీ, తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

PM Modi to Students: భారత్ లోనే మెడిసిన్ చదవొచ్చుగా: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఏపీ భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల్లో తాము ఉన్నట్లు తెలిపారు. రెండు వారాల కిందటే కేంద్ర ప్రభుత్వం తమను వెనక్కి రావాలని అడ్వైజర్ మాత్రమే పంపిందని పేర్కొన్నారు. ఖచ్చితంగా వెనక్కి రావాలని చెప్పలేదు.. అందుకే అక్కడ ఉన్నామని పేర్కొన్నారు. యూనివర్సిటీ యాజమాన్యం కూడా కేవలం ఆఫ్ లైన్ క్లాసు నిర్వహించిందని చెప్పారు. ప్రత్యేక తరగతులు మిస్ అవుతామనే కారణంతో అక్కడే ఉండిపోయామని తెలిపారు.

ముందుగానే ఇండియాకు రావాలని టికెట్లు బుక్ చేసుకున్నామని వెల్లడించారు. కానీ ఇంతలోనే యుద్ధం ప్రారంభమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను భారత్ కు తీసుకువచ్చాయని తెలిపారు. విమానంలో అవసరమైన ఫుడ్, కేక్ లు ఇచ్చారు, బాగా చూసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రానికి రాష్ట్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తమ స్వస్థలాలకు టికెట్లు బుక్ చేసిందన్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ కార్లలో ఇళ్లకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.