Rajinikanth Meets Chandrababu : నిన్న పవర్ స్టార్, నేడు సూపర్ స్టార్.. చంద్రబాబును కలిసిన రజనీకాంత్

ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుని కలిశారు. హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చిన రజినీకాంత్ ను సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. ఇరువురు ఒకరినొకరు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పలు అంశాలపై చర్చించారు.

Rajinikanth Meets Chandrababu : నిన్న పవర్ స్టార్, నేడు సూపర్ స్టార్.. చంద్రబాబును కలిసిన రజనీకాంత్

Rajinikanth Meets Chandrababu : ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చిన రజినీకాంత్ ను సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. ఇరువురు ఒకరినొకరు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పలు అంశాలపై చర్చించారు. తన ఇంటికి వచ్చిన తలైవాను శాలువ కప్పి సన్మానించారు. చంద్రబాబు.

తమ భేటీకి సంబంధించిన ఫొటోను చంద్రబాబు ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘‘నా ప్రియమైన స్నేహితుడు తలైవా రజనీకాంత్‌ను కలిసి, ముచ్చటించడం చాలా ఆనందంగా ఉంది’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే వీరి భేటీ సినీ, రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది.

Also Read..Chandrababu-Pawan Kalyan Meeting : చంద్రబాబు, పవన్ భేటీతో వేడెక్కిన ఏపీ పాలిటిక్స్.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయా?

కాగా, చంద్రబాబు రజనీకాంత్ ఎప్పటి నుంచో మంచి స్నేహితులు అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా.. మరికొందరు వీరి భేటీని రాజకీయ కోణంలో చూస్తున్నారు. మొత్తంగా.. నిన్న పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయిన చంద్రబాబు ఇప్పుడు రజనీకాంత్‌తో సమావేశం కావడం సినీ, రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబు, రజనీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లు సమాచారం.

Also Read..Chandrababu Pawan Kalyan Meeting : టార్గెట్ వైసీపీ.. ఒక్కటైన టీడీపీ, జనసేన..! చంద్రబాబు, పవన్ ఏం చర్చించారంటే..

చంద్రబాబును పవన్ కల్యాణ్ స్వయంగా వెళ్లి కలుసుకున్న మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కుప్పం పర్యటనలో చంద్రబాబు అడ్డంకులను ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు పవన్ కల్యాణ్. అయితే, ఈ భేటీ.. టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు పొడిచిందనే అభిప్రాయాలకు తావిచ్చింది. ఆ దిశగానే ఈ ఇద్దరు నాయకులు భేటీ అయ్యారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రజినీకాంత్ చంద్రబాబును కలుసుకోవడం ఆసక్తి రేపుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా ఫ్యాన్ బేస్ ఉన్న సూపర్ స్టార్ రజనికాంత్. బీజేపీ సానుభూతిపరుడిగానూ ఆయనపై ముద్ర ఉంది.

మొత్తంగా వరుస భేటీలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు చంద్రబాబు. నిన్న జనసేనాని పవన్ స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్లి రెండు గంటల పాటు భేటీ కావడం డిస్కషన్ కు దారితీసింది. ఇప్పుడేమో ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అవ్వడం మరో హాట్ టాపిక్ అయ్యింది.

బీజేపీకి సపోర్ట్ గా ఉన్న రజనీకాంత్ స్వయంగా వచ్చి చంద్రబాబుతో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇది సాధారణ భేటీ అని.. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కోసం వచ్చిన రజనీకాంత్ మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశారు తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ చర్చలు లేవని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.