NGT Compensation : రూ.250 కోట్లు వెంటనే చెల్లించండి, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) విధించిన నష్ట పరిహారాన్ని వెంటనే జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

NGT Compensation : రూ.250 కోట్లు వెంటనే చెల్లించండి, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

NGT Compensation : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) విధించిన నష్ట పరిహారాన్ని వెంటనే జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంపై ఎన్జీటీ రూ.250 కోట్లు జరిమానా విధించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ విధించిన జరిమానాను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం నష్టపరిహారం అంశం మినహా ఎన్జీటీ ఇచ్చిన తీర్పులోని అన్ని అంశాలను యధాతథంగా అమలు చేయాల్సిందేనని తీర్పు చెప్పింది. రూ.250 కోట్ల నష్టపరిహారం అంశంపై మాత్రం విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటివరకు ఎన్జీటీ తీర్పులోని మిగిలిన అంశాలు అమలు చేయాలని సూచించింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫ్రిబవరిలో చేపట్టనున్నట్లు తెలిపింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధిస్తూ ఇటీవల ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. పురుషోత్తపట్నంకు రూ.2.48 కోట్లు, పట్టిసీమకు రూ.1.90 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ జరిమానా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. వీటిని ఎలా వినియోగించాలో ఏపీ పీసీబీ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అయితే, ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఎన్జీటీ సిఫారసులను యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది.

కాగా.. పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి.. పోలవరంలో భాగమైన ప్రాజెక్టులని ఏపీ ప్రభుత్వం వాదించింది. పోలవరం పూర్తవడానికి ముందే నీటిని పోలవరం కాలువల ద్వారా పంపించడానికి నిర్మించిన ప్రాజెక్టులని అంటోంది. అయితే వీటికి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ఎన్జీటీలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా అనుమతులు లేకుండా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపైనా ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిపై విచారణ జరుపుతోంది. ఈ మూడు ప్రాజెక్టులు అక్రమం అని గతంలోనే ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. ఈ మూడు ప్రాజెక్టులు పోలవరంలో భాగం కాదని కేంద్ర జలశక్తి శాఖ ఎన్జీటీకి చెప్పింది. దీంతో పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎన్‌జీటీ స్పష్టం చేసింది.