Taraka Ratna Health : వైద్యం కోసం విదేశాలకు తారకరత్న..? మెదడు స్కానింగ్ రిపోర్టు వచ్చాక నిర్ణయం

మెదడును స్కాన్ తీశారు. స్కాన్ కి సంబంధించిన రిపోర్టు రేపో మాపో రానుంది. ఆ రిపోర్టు ఆధారంగా అవసరమైతే తారకరత్నను విదేశాలకు తరలించి ట్రీట్ మెంట్ అందించాలని కుటంబసభ్యులు భావిస్తున్నారు.

Taraka Ratna Health : వైద్యం కోసం విదేశాలకు తారకరత్న..? మెదడు స్కానింగ్ రిపోర్టు వచ్చాక నిర్ణయం

Taraka Ratna Health : గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఇవాళ కూడా ఆయనకు పలు టెస్టులు చేశారు డాక్టర్లు. మెదడును స్కాన్ తీశారు. స్కాన్ కి సంబంధించిన రిపోర్టు రేపో మాపో రానుంది. ఆ రిపోర్టు ఆధారంగా అవసరమైతే తారకరత్నను విదేశాలకు తరలించి ట్రీట్ మెంట్ అందించాలని కుటంబసభ్యులు భావిస్తున్నారు.

మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఇక బెంగళూరులో వినాయక టెంపుల్ లో హిందూపురం టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని 101 కొబ్బరికాయలు కొట్టారు.

Also Read..Taraka Ratna Health : తారకరత్నకు కిడ్నీలో సమస్య.. C.T. స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు

టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ‘ఇవాళ తారకరత్న మెదడును స్కాన్ తీశారు. వచ్చే నివేదికల ఆధారంగా మెదడు పనితీరు తెలుస్తుంది. పరిస్థితిని బట్టి అవసరమైతే తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు’ అని లక్ష్మీనారాయణ తెలిపారు.

Also Read..Vijayasai Reddy : తారకరత్న హెల్త్ కండీషన్ పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

తారకరత్న తప్పకుండా కోలుకుంటారని వైద్యం చేస్తున్న డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేసినట్లు టీడీపీ నేత తెలిపారు. గత ఆరు రోజులుగా ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. అవసరమైతే విదేశాలకు పంపించి ట్రీట్ మెంట్ అందించేందుకు ఆయన ఆలోచన చేస్తున్నారు. తారకరత్న తిరిగి కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తారకరత్నకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని లక్ష్మీనారాయణ కోరుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రస్తుతం హార్ట్ బీట్ బాగుంది. మెదడులో చిన్న వాపు వల్ల తారకరత్నకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. స్కానింగ్ రిపోర్టులో వాపు పరిస్థితి తెలుస్తుంది. ఆ రిపోర్టు వచ్చాక ట్రీట్ మెంట్ ఏ విధంగా చేయాలన్న దాని గురించి డాక్టర్లు ఆలోచన చేస్తున్నారని అంబికా లక్ష్మీనారాయణ వెల్లడించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో తారకరత్న కుప్పకూలిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను కుప్పంలోని ఆసుపత్రికి తరలించగా.. ఆయన గుండెపోటుకు గురయ్యారని వైద్యులు నిర్ధారించారు. కుప్పంలో ప్రాధమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయనను వెంటిలేటర్ పై ఉంచి అత్యాధునిక పరికరాలతో చికిత్స అందిస్తున్నారు.