Vijayasai Reddy : తారకరత్న హెల్త్ కండీషన్ పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అప్ డేట్ ఇచ్చారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

Vijayasai Reddy : తారకరత్న హెల్త్ కండీషన్ పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Vijayasai Reddy : గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అప్ డేట్ ఇచ్చారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

జనవరి 27న ఘటన జరిగిన రోజు 45 నిమిషాలు పాటు గుండె ఆగిపోవడంతో హార్ట్ పైభాగం దెబ్బతిందన్నారు. మెదడులో నీరు చేరి వాపు ఏర్పడిందన్నారు. వాపు తగ్గితే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్స్ చెప్పారని విజయసాయిరెడ్డి తెలిపారు. గుండె బాగా పని చేస్తోందని, తారకరత్న త్వరలోనే కోలుకుంటారని చెప్పారు విజయసాయిరెడ్డి.

Also Read..Vijayasai Reddy Thanks Balakrishna : బాలకృష్ణకు విజయసాయి రెడ్డి థ్యాంక్స్.. ఎందుకు చెప్పారంటే..

బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్నకు విజయసాయిరెడ్డి బంధువు అన్న సంగతి తెలిసిందే. తారకరత్న భార్య అలేఖ్య విజయసాయిరెడ్డి అర్ధాంగి సునంద చెల్లెలి కూతురే. అలేఖ్య రెడ్డిని తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ వరుసలో విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు అవుతారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లిన విజయసాయిరెడ్డి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తారకరత్న గుండె, కాలేయం ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సాఫీగా పనిచేస్తున్నాయని డాక్టర్లు తెలిపినట్లు ఆయన చెప్పారు. గుండెకు ఇవాళ ఎలాంటి చికిత్స అందించలేదని, అయితే తారకరత్న మెదడులో వాపు ఏర్పడిందని వివరించారు.

Also Read..Taraka Ratna Health : చికిత్స పొందుతున్న తారకరత్న ఫోటో లీక్..

తారకరత్న గుండెపోటుకు గురైన రోజున 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయిందని, దాంతో మెదడులో కొంతభాగం దెబ్బతిందని తెలిపారు. మెదడులో నీరు చేరిన ఈ పరిస్థితిని ఎడిమా అంటారని వివరించారు. దీంతో మెదడు కిందికి జారిపోయే ప్రమాదం ఉందని అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరో మూడు నాలుగు రోజుల్లో మెదడు ఆరోగ్యానికి సంబంధించిన పురోగతి కనిపించవచ్చని డాక్టర్లు ఇటీవల చెప్పారని వివరించారు. ఇప్పటికే మూడుజులు గడచిపోయింది కాబట్టి, రేపటి నుంచి ఆయన మెదడు ఆరోగ్యం నిలకడగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. ఇదే సమయంలో అద్భుతమైన చికిత్స అందిస్తున్నారని డాక్టర్లను కొనియాడారు. అటు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. తారకరత్నకు సంబంధించి అన్ని విషయాలను బాలయ్య దగ్గరుండి చూసుకుంటున్నారని థ్యాంక్స్ చెప్పారు విజయసాయిరెడ్డి.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో తారకరత్న కుప్పకూలిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను కుప్పంలోని ఆసుపత్రికి తరలించగా.. ఆయన గుండెపోటుకు గురయ్యారని వైద్యులు నిర్ధారించారు. కుప్పంలో ప్రాధమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయనను వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్ తో పాటు అత్యాధునిక పరికరాలతో చికిత్స అందిస్తున్నారు.