Andhra Pradesh : ఇడుపుల పాయలో సొరంగాలు తవ్వి అక్రమ సొమ్ము దాచి పెడుతున్నారు : అచ్చెన్నాయుడు
కష్టాల్లో ఉన్న రైతుల్ని బూతులు తిడుతున్నారని వారు మంత్రులా? అంటూ మండిపడ్డారు. వక్ర భాష్యాలతో తమ తప్పుల్ని చేతకానితనాన్ని సమర్ధించుకుంటున్నారంటూ విమర్శించారు అచ్చెన్నాయుడు.

atchannaidu..Jagan
Andhra Pradesh : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల గురించి రైతులు పడుతున్న కష్టాల గురించి ప్రభుత్వం పట్టించుకోవటంలేదని..తమ బాధలు చెప్పుకోవటానికి వెళితే మంత్రులు రైతులను అవమానకరంగా మాట్లాడుతున్నారంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రైతుల్ని బూతులు తిడుతున్నారని వారు మంత్రులా? అంటూ మండిపడ్డారు. వక్ర భాష్యాలతో తమ తప్పుల్ని చేతకానితనాన్ని సమర్ధించుకుంటున్నారంటూ విమర్శించారు అచ్చెన్నాయుడు.
పంట మునిగిపోయి ధాన్యం తడిసిపోయి మొక్కలు వస్తుంటే మంత్రులు ఏమాత్రం పట్టించుకోకపోగా కష్టాలు చెప్పుకోవటానికి వచ్చిన రైతుల్ని బూతులు తిట్టి పంపించటం వైసీపీ మంత్రులకే చెల్లింది అంటూ విమర్శించారు. రాజధాని ఏదో చెప్పుకోలేని దైర్భాగ్యస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారని అన్నారు.ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోని సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను అక్రమ సొమ్ముతో నింపేస్తున్నారని..అక్రమ సొమ్ముతో తాడేపల్లి ప్యాలెస్ నిండిపోవటంతో ఆ డబ్బంతా ఇడుపులపాయలో సొరంగాలు తవ్వి అక్కడ దాచిపెడుతున్నారంటూ అచ్చెన్నాడు ఆరోపించారు.
కాగా..ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతినటంతో రైతులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆరుగాలం పండించి పంట కొన్ని రోజుల్లో చేతికొస్తుందనగా మోచ తుపాను ప్రభావానికి అకాల వర్షాలు కురియటంతో పంటంతా దెబ్బదింది. ముఖ్యంగా వరిపంట,కోత కోసిన తరువాత కూడా వర్షాలకు వరి ధాన్యం నీటిలోమునిగిపోయింది. దీంతో రైతులు చేతికి అందివచ్చే సమయానికి వర్షాలు దెబ్బకొట్టటంతో నిలువునా నీరుగారిపోయారు.
పెట్టిన పెట్టుబడి రాకపోగా తడిచిన ధాన్యాన్ని ఏం చేయలేక అంగలారుస్తున్నారు. తడిచిన ధాన్యం ప్రభుత్వం కొనకపోవటంతో తమను ఆదుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధుల్ని వేడుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకెళ్లి తమ బాధలు చెప్పుకుంటుంటే వారు మాత్రం వర్షాలు కురిస్తే మాదా తప్పు? అంటూ నిర్లక్షంగా సమాధానం చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. తమ గోడు పట్టించుకునే నాధుడే లేక రైతులంతా అల్లాడిపోతున్నారు.