AP Casino Issue : బుద్దా వెంకన్న అరెస్టు..

గుడివాడలో కాసినో వ్యవహారంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్‌గా మారాయి. కాసినో ఎపిసోడ్‌లో డీజీపీకి కూడా వాటాలు అందాయని.. తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై

AP Casino Issue : బుద్దా వెంకన్న అరెస్టు..

Buddha

Updated On : January 24, 2022 / 6:34 PM IST

Buddha Venkanna Arrest : ఏపీ కాసినో వ్యవహరం ముదిరి పాకాన పడుతోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. అనంతరం బుద్దా వెంకన్నను తోటవల్లూరు పీఎస్ కు తరలించారు. అరెస్టు చేస్తున్న సందర్భంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అరెస్టు చేయకుండా ఉండేందుకు ఆయన అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని…వైసీపీ నేతల ఫిర్యాదుతో బుద్దా వెంకన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More : Thaman : పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బెస్ట్ ఫిలిం ‘భీమ్లా నాయక్’.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్..

గుడివాడలో కాసినో వ్యవహారంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్‌గా మారాయి. కాసినో ఎపిసోడ్‌లో డీజీపీకి కూడా వాటాలు అందాయని.. తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై వివరణ అడిగేందుకు పోలీసులు విజయవాడలో బుద్దా వెంకన్న ఇంటికి వెళ్లారు. దీంతో బుద్దా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కేసినో వివాదంపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీని కలవాలని నిర్ణయించిన టీడీపీ నేతలు…ఉదయం నుంచి ఆయన అపాయింట్‌మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. బుద్దా వెంకన్న అరెస్టుతో ఏపీలో మరోసారి రాజకీయాలు మరింత వేడెక్కాయి.