JC Prabhakar Reddy : కేటీఆర్ కామెంట్స్ పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్ నిజాలు చెప్పి మాట మారుస్తారెందుకు? మాట మీద నిలబడండి అని అన్నారు. తగ్గొద్దు.. తగ్గేదేలే అంటూ కేటీఆర్ కు జేసీ ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

JC Prabhakar Reddy : కేటీఆర్ కామెంట్స్ పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jc Prbhakar

JC Prabhakar Reddy : తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో నీళ్లు లేవు, కరెంట్ కోతలున్నాయి.. రోడ్లు బాగోలేవు అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలన్నీ నిజాలేనని అన్నారు. ఆ వ్యాఖ్యలు నోరు జారితే వచ్చినవి కావన్నారు. కేటీఆర్ వాస్తవాలే చెప్పారంటూ తెలిపారు. కేటీఆర్ టంగ్ స్లిప్ అవ్వలేదు, నిజమే చెప్పారని స్పష్టం చేశారు.

కేటీఆర్ చేసిన వాఖ్యలకు ధైర్యంగా కట్టుబడి ఉండాలని, భయపడాల్సిన పని లేదని పేర్కొన్నారు. ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు బాగా లేవన్నారు. భవిష్యత్తు నాయకుడు ధైర్యంగా ఉండాలంటూ కేటీఆర్ కు జేసీ సూచించారు. కేటీఆర్ నిజాలు చెప్పి మాట మారుస్తారెందుకు? మాట మీద నిలబడండి అని అన్నారు. తగ్గొద్దు.. తగ్గేదేలే అంటూ కేటీఆర్ కు జేసీ ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ మీ వెంబడి తిరిగి ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపిస్తానని ఆయన అన్నారు.

KTR Tweet : జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా-కేటీఆర్ మరో ఆసక్తికర ట్వీట్

ఏపీలో రోడ్లు ధ్వంసమై పోయాయని, అక్కడ కనీసం విద్యుత్ కూడా సమయానికి ఉంటుందో లేదో అర్థం కావడం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ వాళ్లను నాలుగు బస్సుల్లో తీసుకెళ్లి చూపిస్తే ఇక్కడెంత(తెలంగాణలో) బాగుందో తెలుస్తుందని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో పరిస్థితులు ఎంతో మెరుగ్గా ఉన్నాయనే విషయాన్నీ చెప్పేందుకు మంత్రి కేటీఆర్ ఇలా వ్యాఖ్యానించారు.

అయితే ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మంత్రి సెటైర్లు వేయడంపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందిస్తూ మంత్రి కేటీఆర్ లాంటి వ్యక్తి ఏపీ గురించి అలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఏపీకి 4 కాదు 40 బస్సులు వేసుకురావాలని మంత్రి అప్పలరాజు కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం మా ఉద్దేశం కాదన్నారు. ఏపీలో తమ ప్రభుత్వ విధానం, అభివృద్ధి చూడాలని చెప్పారు.