Naralokesh : ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం…2024లో టీడీపీ విజయం ఖాయం

ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ నేతలపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని విమర్శించారు.

Naralokesh : ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం…2024లో టీడీపీ విజయం ఖాయం

Kuppam

Naralokesh Kuppam :  : ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ నేతలపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని విమర్శించారు. డీజీపీ, ఎస్పీలు ఖాకీ చొక్కాలు విప్పి వైసీపీ చొక్కాలు కప్పుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రజా ఉద్యమం రాబోతుందని.. ఆ గాలికి వైసీపీ కొట్టుకుపోతుందన్నారు లోకేష్‌. ఖాకీలు లేకుండా వైసీపీ నేతలు బయటకు రాగలరా అని ప్రశ్నించారు లోకేష్‌.

Read More : Chimpanzee: చింపాంజీ వీడియో వైరల్.. ప్లాస్టీక్ భూమికి మంచిది కాదని కోతులకూ తెలుసా?

2024లో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక.. తప్పుచేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు లోకేష్. 8వ సారి కుప్పంలో చంద్రబాబు గెలుస్తారని.. ఆయనే సీఎం అవుతారని చెప్పారు. దొంగ కేసులకు టీడీపీ భయపడదని.. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కుప్పంలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీపై విమర్శలు చేశారు. గురువారం రాత్రి కుప్పం చేరుకున్న నారా లోకేష్.. స్థానిక టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. 2021, నవంబర్ 12వ తేదీ శుక్రవారం కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొననున్నారు. కుప్పంలో రౌడీలు, స్మగ్లర్లు దిగారని.. అయినా కుప్పం ప్రజలపై తమకు నమ్మకం ఉందన్నారు లోకేష్. జగన్ ప్రభుత్వంలో కుప్పం నియోజకవర్గానికి ఏమీ చేయలేదని.. కుప్పంను అభివృద్ధి చేసింది చంద్రబాబేనన్నారు లోకేష్.