Vangalapudi Anitha : హరికృష్ణ, జూ.ఎన్టీఆర్.. కొడాలి నానిని తన్ని తరిమేశారు-వంగలపూడి అనిత హాట్ కామెంట్స్

కొడాలి నాని గతంలో హరికృష్ణను ముంచేశారని, అందుకే ఆయన తన్ని తరిమేశారని అనిత అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను కూడా కొడాలి నాని మోసం చేశాడని, అందుకే జూ.ఎన్టీఆర్.. కొడాలి నాని దూరంగా పెట్టారని అనిత అన్నారు.

Vangalapudi Anitha : హరికృష్ణ, జూ.ఎన్టీఆర్.. కొడాలి నానిని తన్ని తరిమేశారు-వంగలపూడి అనిత హాట్ కామెంట్స్

Vangalapudi Anitha : ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఎన్టీ రామారావు అంశంలో వైసీపీ నేతలు చంద్రబాబుని టార్గెట్ చేశారు. చంద్రబాబు వెన్నుపోటుదారుడు అని విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుని 420తో పోలుస్తున్నారు. ఎన్టీఆర్ ను మోసం చేసి ఆయన నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో మాజీమంత్రి కొడాలి నాని డోస్ పెంచారు. చంద్రబాబును నోటికొచ్చినట్లు తిడుతున్నారు.

కొడాలి నాని వ్యాఖ్యలకు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటుగా బదులించారు. కొడాలి నానిపై ఆయన ఎదురుదాడికి దిగారు. కొడాలి నాని గతంలో హరికృష్ణను ముంచేశారని, అందుకే ఆయన తన్ని తరిమేశారని అనిత అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను కూడా కొడాలి నాని మోసం చేశాడని, అందుకే జూ.ఎన్టీఆర్.. కొడాలి నాని దూరంగా పెట్టారని అనిత అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా నానికి టోపీ పెట్టాడని, అందుకే నానిని కేబినెట్ తరిమివేశారని అనిత విమర్శించారు. టెన్త్ ఫెయిల్ అయిన బ్యాచ్ అంతా వైసీపీలో ఉన్నారని అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”1999లో హరికృష్ణ కొడాలి నానిని బూత్ ఏజెంట్ గా పెట్టారు. బూత్ ఏజెంట్ పెడితే శాంతం ఏసేశాడు. దీంతో హరికృష్ణ.. కొడాలి నానిని తన్ని తరిమేశారు. ఆయన పో అంటే.. టీడీపీ నుంచి బయటకు వెళ్లారు. తర్వాత జూ.ఎన్టీఆర్ దగ్గర బాడీగార్డ్ గా చేరాడు. అక్కడ వెధవ వేషాలు వేస్తుంటే.. నా పరువు పోతుందని జూఎన్టీఆర్.. కొడాలి నాని తన్ని తరిమేశాడట. ఆ తర్వాత జగన్ పంచన చేరాడు కొడాలి నాని. మంత్రి పదవి ఇచ్చినా.. దందాలు చేసుకుంటూ జగన్ కు వాటాలు ఇవ్వలేదు. దీంతో జగన్ కూడా కొడాలి నానిని గెంటేశాడు” అని అనిత ఫైర్ అయ్యారు.

”మరోవైపు కొడాలి నానిని గుట్కా నానిగా అభివర్ణించారు టీడీపీ నేతలు. గుట్కా నానికి మతిభ్రమించిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు. గుట్కా నాని చంద్రబాబుపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. చంద్రబాబు స్కామ్ లకు సూత్రధారి అని అమరావతి రైతుల పాదయాత్రను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. గుట్కా నానికి పిచ్చి పట్టింది. పిచ్చి పరాకాష్టకు చేరింది. ఎన్నికలకు ముందు నాని బతుకు దారుణం. గుడివాడ బస్టాండ్ దగ్గరికి వెళితే నాని బతుకేంటే ఎవరైనా చెప్తారు. చంద్రబాబుని ఉద్దేశించి పనికిరాని మాటలు, వాగుడు వాగితే సహించేది లేదు” అని కొడాలి నానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బుద్ధా వెంకన్న.