Yarapathineni Srinivas : వైసీపీలోని ఓ వర్గం నుంచే కొడాలి నానికి ప్రమాదం-టీడీపీ నేత సంచలనం

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీలోని ఓ వర్గంతోనే ప్రమాదం పొంచి ఉందని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ ఆరోపించారు. కొడాలి నాని మంత్రి పదవి పోవడానికి కూడా ఆ వర్గమే ప్రధాన కారణం అన్నారాయన.

Yarapathineni Srinivas : వైసీపీలోని ఓ వర్గం నుంచే కొడాలి నానికి ప్రమాదం-టీడీపీ నేత సంచలనం

Yarapathineni Srinivas : మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీలోని ఓ వర్గంతోనే ప్రమాదం పొంచి ఉందని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ ఆరోపించారు. కొడాలి నాని మంత్రి పదవి పోవడానికి కూడా ఆ వర్గమే ప్రధాన కారణం అన్నారాయన. టీడీపీ నుంచి కొడాలికి ప్రమాదం ఉందనే సంకేతాలు ఇస్తూ వైసీపీలోని ఓ వర్గమే కొడాలి నానికి ముప్పు కలిగిస్తుందని ఆరోపించారు యరపతినేని. సొంత పార్టీ నేతల నుంచే కొడాలి నానికి ప్రమాదం పొంచి ఉందంటూ టీడీపీ నేత యరపతినేని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

”వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజావేదికను కూల్చారు, కేసులు పెట్టించారు, వ్యవస్థల్ని నాశనం చేశారు, పరిశ్రమల్ని రానివ్వకుండా చేశారు. జగన్ పెంచి పోషించిన కొంతమంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన టీడీపీ వ్యవస్థాపకుడైన అన్న నందమూరి తారక రామారావు కుటుంబం గురించి.. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంలోని రాజకీయాలతో సంబంధం లేని మహిళల మీద కొడాలి నాని మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్‌తో కొడాలి నాని మాట్లాడుతున్నారు” అని యరపతినేని ధ్వజమెత్తారు.

ప్రజలపైన, ప్రశ్నించిన వారిపైన జగన్ అక్రమ కేసులు పెట్టించారు. రాజకీయాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని ఒరవడి జగన్ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాల్లో రాజకీయాలతో సంబంధం లేని మహిళలు గురించి మాట్లాడించి సైకోలా పైశాచిక ఆనందం పొందుతున్నారు. కొడాలి నాని, గోరంట్ల మాధవ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జోగి రమేష్, పోతుల సునీత ఎవరు మాట్లాడినా మూలం జగన్. జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడి ఈడీ, సీబీఐ కేసుల్లో చిక్కుకున్నారు. ఇలాగే ఎదుటివారి కుటుంబాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నందున ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారు. కానీ ఏమీ చేయలేరని గుర్తు పెట్టుకోవాలి” అని హితవు పలికారు టీడీపీ నేత యరపతినేని.

రెచ్చిపోతున్న కొడాలి నాని మంత్రి పదవిని వైసీపీలోని ఓ వర్గమే తీసేసిందని గుర్తు చేసుకోవాలి. మంత్రి పదవి నుంచి తొలగించిన ఆ వర్గం నుంచే కొడాలి నానికి ప్రమాదం పొంచి ఉందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎప్పుడూ ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటుంది. ఎవరు ఎలా ప్రవర్తించినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నిస్తాం. మేము కూడా మీ కుటుంబంలోని మహిళల గురించి మాట్లాడితే ఎంత బాధ పడతారు. టీడీపీని ఏదో చేయాలనుకున్న చాలామంది కాల గర్భంలో కలిసిపోయారు. అనవసరంగా నోరు పారేసుకునే వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు” అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు యరపతినేని.